వేప ఆకుల్లో ఎన్నో దివ్య ఔషద గుణాలుంటాయి. వీటిని తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి.

వేప ఆకులను రోజూ కొన్ని తింటే కడుపులోని చెడు బ్యాక్టీరియా చనిపోతుంది. ఎన్నో రకాల ఇన్ఫెక్షన్ల ప్రమాదం తగ్గుతుంది.

వీటిలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఎన్నో రోగాల నుంచి రక్షిస్తాయి. 

ఇందుకోసం రోజుకు 6-8 వేప ఆకులను మాత్రమే తినాలని నిపుణులు చెబుతున్నారు. 

ఇంతకంటే ఎక్కువ తింటే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం.

వేప ఆకులు టైప్ 2 డయాబెటీస్ పేషెంట్లకు ప్రయోజనకరంగా ఉంటాయి. 

ఈ ఆకులను తినడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు కంట్రోల్లో ఉంటాయి.

ఒకవేళ వేప ఆకుల్ని మరీ ఎక్కువగా తింటే రక్తంలో చక్కెర స్థాయిలు మరీ దారుణంగా పడిపోతాయి. దీంతో మైకం, బలహీనత వంటి సమస్యలు వస్తాయి.

రోజూ ఒకటి నుంచి రెండు వేపాలకు తింటే చాలు. దీనికంటే ఎక్కువగా తింటే కిడ్నీలు దెబ్బతింటాయిని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మూత్రపిండాలు దెబ్బతింటే మన శరీరంలో వ్యర్థాలు పేరుకుపోయే ప్రమాదం ఉంది.

వేపాకులను మరీ ఎక్కువగా తీసుకుంటే నోట్లో అలెర్జీ వస్తుంది. అలాగే మంట కూడా పెడుతుందని ఎన్నో పరిశోధనలు వెల్లడించాయి.

అయినప్పటికీ వేపాకులను దద్దుర్లు, అలెర్జీ సమస్యను తగ్గించుకోవడానికి ఎక్కువగా ఉపయోగిస్తాయి. అప్పుడప్పుడు వీటివల్ల మంచే జరుగుతుంది.

అలా అని వేపాకులను ఎక్కువగా ఉపయోగిస్తే తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇది టెస్టోస్టెరాన్ స్థాయిలను తగ్గిస్తుంది.

ఎలుకలపై చేసిన పరిశోధనలో వేపను ఎక్కువగా ఉపయోగించడం వల్ల అండోత్సర్గంపై చెడు ప్రభావం పడిందని వెల్లడైంది.

ఎన్నో జంతు అధ్యయాల్లో.. సంతానోత్పత్తిపై మగాళ్లలో వేప చెడు ప్రభావం చూపిందని తేలింది. అందుకే వీటిని మోతాదులోనే తినాలి. లేదంటే చాలా డేంజర్.

నోట్: పైన టిప్స్ పాటించేముందు మీ దగ్గర్లోని డాక్టర్, నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం.