అయితే అతిగా మామిడి పండ్డు తింటే మాత్రం మొదటికే మోసం వస్తుందంటున్నారు నిపుణులు.
మామిడి పండ్లను అధికంగా తినడం వలన ఆరోగ్యానికి హానికరం.
తియ్యగా ఉన్నాయని ఎక్కువగా తినేస్తే మీ ఆరోగ్యం ప్రమాదంలో పడినట్టేనని నిపులుణులు హెచ్చరిస్తున్నారు
మామిడి పండులోని పొటాషియం, సోడియం అధిక రక్తపోటును నియంత్రిస్తాయి.
అలాగే మామిడి పండు గుండె సంబంధిత సమస్యల నుంచి దూరంగా ఉంచుంది.
అయితే మామిడి పండ్లను అతిగా లాగిస్తే మాత్రం చాలా మంది అలెర్జీ వస్తుంది.
అలెర్జీకి కారణమయ్యే వాటిలో మామిడి ప్రోటీన్ ఒకటి.
మామిడి పండ్లను తినడం వలన రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరుగుతుంది.
సహజ గ్లూకోజ్ కారణంగా మధుమేహం బాధపడేవారు.. మామిడి పండ్లను రెగ్యులర్ గా తినలేరు.
మామిడిలో ఉండే పైబర్ కారణంగా ఇది జీర్ణక్రియపై ప్రభావం చూపిస్తుంది.
ఒకేసారి ఎక్కువ మామిడి పండ్లను తినడం వలన వేగంగా బరువు పెరుగుతారంట.
నిపుణుల అభిప్రాయం ప్రకారం మామిడి పండ్లను ఎక్కువగా తినడం వలన జీఐ సమస్యలు వస్తాయి.
కాబట్టి మితంగా మామిడి పండ్లను ఆరగించడం ఆరోగ్యానికి మంచింది.