వేసవి కాలం రావడంతో ఇప్పుడిప్పుడే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
వేసవి తాపం నుంచి బయటపడేందుకు చాలా మంది చల్లటి పదార్థాలను తీసుకుంటుంటారు.
మరీ ముఖ్యంగా చాలా మంది ఫ్రిడ్జ్ లో ఉన్న కూల్ వాటర్ ను తాగేందుకు ఇష్టపడుతుంటారు.
ఫ్రిడ్జ్ లో ఉన్న కూల్ వాటర్ తాగడం వల్ల వచ్చే నష్టాలు ఏంటి? అసలు నిపుణులు ఏం చెబుతున్నారో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
వేసవి కాలంలో దాహాన్ని తీర్చుకునేందుకు చాలా మంది కూల్ వాటర్ తాగేందుకు ఆసక్తి చూపిస్తుంటారు.
ఫ్రిడ్జ్ లో ఉన్న కూల్ వాటర్ తాగడం చాలా ప్రమాదం పొంచి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అన్నం తిన్న వెంటనే కూల్ వాటర్ తాగడం వల్ల జీవక్రియపై ప్రభావం చూపిస్తుంది. మరీ ముఖ్యంగా జీర్ణ సంబంధమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది.
చల్లటి నీరు తాగడం వల్ల గుండెలోని వాగస్ నరాల మీద ప్రభావం చూపే అవకాశం ఉంటుందని, ఇది గుండె పోటుకు కారణం కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
చల్లటి నీరు తాగడం ద్వారా గొంతులో ఉండే రక్షిత పొర దెబ్బతినే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
చల్లటి నీరు తాగడం ద్వారా శరీరంలో ఉండే కొవ్వు బయటకు పోవడానికి ఆస్కారం ఉండదు. తద్వారా అధిక బరువు పెరిగే అవకాశం ఉంటుందట.
ముఖ్యంగా ఫ్రిడ్జ్ లో ఉండే అధిక కూల్ వాటర్ తాగడం వల్ల పంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఇలా ఫ్రిడ్జ్ లో ఉండే అధిక కూల్ వాటర్ తాగడం కన్నా.. సహజసిద్దంగా తయారు చేసిన మట్టి కుండలోని నీరు తాగడం అన్ని రకాలుగా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.