బీట్ రూట్ లో ఎన్నో రకాల పోషకాలుంటాయని మనందరికీ తెలిసిన సంగతే.

బీట్ రూట్లోని పోషకాలన్నీ మన శరీరాన్ని ఎంతో ఆరోగ్యంగా ఉంచుతాయి

అందులోని ఐరన్ కంటెంట్ శరీరంలో రక్త కణాలను, హిమోగ్లోబిన్ లెవెల్స్ ను పెంచుతుంది. 

బీట్ రూట్లోని ఖనిజాలు, విటమిన్లు పలు రకాల అనారోగ్య  సమస్యలను తగ్గిస్తాయి. 

అయితే, బీట్ రూట్ను అతిగా తీసుకోవటం వల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి.

అందులో ఉండే ఆక్సలేట్ కిడ్నీల్లో రాళ్లను పుట్టిస్తుంది.

కిడ్నీల్లో రాళ్లున్నవారు బీట్ రూట్ జ్యూస్ ను తాగకూడదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అలెర్జీ సమస్యలు ఉన్నవారు కూడా బీట్ రూట్ను తీసుకోకూడదు.

గర్భిణులు బీట్ రూట్ లను అతిగా తినకూడదు. 

దానిలోని నైట్రేట్ల వల్ల  చేతులు, పెదాలు, కాళ్ల చర్మ రంగు మారుతుంది. అలాగే కళ్లు తిరుగుతాయి

తలనొప్పి కూడా వస్తుంది. 

బీట్ రూట్ జ్యూస్ ను ఎక్కువగా తాగడం వల్ల కాలేయం దెబ్బతింటుందని ఆరోగ్య నిపుణుల హెచ్చరిస్తున్నారు.

శరీరంలో కాల్షియం లెవెల్స్ కూడా బాగా తగ్గిపోయి ఎముకలు బలహీనపడతాయి.