సాధారణంగా దగ్గు, జలుబు, జ్వరం వస్తే ఇమ్యూనిటీ పెంచే ఆహారం తినాలంటారు. మెంతి కూర ఇమ్యూనిటీ బాగా పెంచుతుంది

మెంతికూరలో పుష్కలంగా  క్యాల్షియం, విటమిన్ ఎ, విటమిన్ సి, పొటాషియం, సెలీనియం, మాంగనీస్ లు ఉన్నాయి

మెంతి కూరను ఎన్నో రకాలుగా తింటారు. ఎక్కువగా కూరల్లో వేస్తుంటా.. సపరేట్ గా వండుకొని తింటారు. జ్యూస్, సలాడ్ రూపంలో తింటారు.

మెంతిలో అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి.. ఇది డయాబెటీస్ ఉన్నవారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది

ఈ ఆకుల్లో  ఫైబర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉండటం వల్ల జీర్ణ వ్యవస్థను ఎంతో చక్కగా ఉంచుతుంది. 

 మెంతిలో  యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉండటం వల్ల పొట్టకు సంబంధించిన సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి.

మెంతి తరుచూ తినడం వల్ల  ఎముకలు బలోపేతం అవుతాయి. కీళ్ల నొప్పులు తగ్గిపోతాయి. 

మెంతి ఆకులను తీసుకుని గ్రైండ్ చేసి జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. 

మెంతి ఆకులలో   మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల  చర్మ సమస్యలను దూరం చేస్తుంది.

తరుచూ ఈ ఆకు తినడం వల్ల మనకు అవసరమైన మంచి కొలెస్ట్రాల్ పెరిగేందుకు  సాయపడతాయి

మెంతి ఆకుల్లోని ఆమైనో యాసిడ్   ఇన్సులిన్ ఉత్పత్తిని  పెంచి టైప్ 2 డయాబెటిస్‌  కంట్రోల్ చేస్తుంది.

జంగ్ ఫుడ్ తినేవారికి  అజీర్తి, గ్యాస్, పొట్టలో ఉబ్బరం వంటి చాలా సమస్యలు చెక్ పెడుతుంది

మెంతి తినడం వల్ల కిడ్నీలు, లివర్‌ ణాలు దెబ్బ తినకుండా కాపాడుతాయి.