ఆలయాలకు వెళ్ళినప్పుడు పూజలు, వ్రతాలు చేస్తుంటారు.

కొంతమంది ఇళ్లలో పూజరితో పూజలు, వ్రతాలు చేయిస్తారు.

పూజలో ఉండగా పూజారి ప్రసాదం, తీర్థం ఇస్తారు.

తీర్థం చేతిలో తీసుకుని.. తాగుతారు. ఆ తర్వాత తల మీద నుంచి చేతిని వెనక్కి పోనిస్తూ జుట్టుకి రాస్తారు.

అయితే మీకు తెలుసా.. తీర్థం తీసుకుని ఆ చేతితో జుట్టుని తాకకూడదని శాస్త్రం చెబుతోంది.

తీర్థం పంచామృతంతో చేస్తారు. తేనె, పెరుగు, పాలు, నెయ్యి, పంచదారతో తీర్థం తయారుచేస్తారు.

జుట్టుకి పంచదార, తేనె వంటివి జుట్టుకి మంచిది కాదట.

అలానే తులసి తీర్థం తీసుకున్నాక చేతికి ఎంగిలి అంటుకుంటుంది.

ఆ చేతిని జుట్టుకి రాసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉండవని అంటున్నారు.

తీర్థం తీసుకున్నాక చేతులు నీటితో కడుక్కోవాలని పండితులు చెప్తున్నారు.

తీర్థం తీసుకున్నాక చేతిని జేబురుమాలుతో తుడుచుకోవాలి.

గంగా జలంతో అభిషేకం చేసిన తీర్ధాన్ని మాత్రం తలకు రాసుకోవచ్చునని పండితులు చెబుతున్నారు.