మన దేశంలో షుగర్, థైరాయిడ్ సమస్యతో బాధపడేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి.

డయాబెటిస్ వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు దారుణంగా పెరిగిపోతాయి. థైరాయిడ్ వల్ల గొంతు వాచిపోయినట్లు కనిపిస్తుంది.

అయితే కొన్నిరకాల ఆకుపచ్చని ఆకులు థైరాయిడ్, షుగర్ వ్యాధుల్ని కంట్రోల్లో ఉంచుతాయని నిపుణులు చెబుతున్నారు.

ప్రతి కూరలోనూ కరివేపాకు వేస్తుంటాం. కానీ తినేటప్పుడు తీసి పక్కన పెట్టేస్తాం. కానీ దాని వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

కరివేపాకులోని ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది థైరాయిడ్ గ్రంధిని ఆరోగ్యంగా ఉంచుతుంది. అందుకే థైరాయిడ్ పేషెంట్స్ తప్పకుండా తినాలి.

వేప ఆకుల్లో యాంటీ డయాబెటీస్ లక్షణాలు ఉంటాయి. ఇవి షుగర్ లెవల్స్ ని కంట్రోల్లో ఉంచడానికి హెల్ప్ చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.

రోజూ కొన్ని పచ్చి వేప ఆకులను నమలడం వల్ల థైరాయిడ్ గుర్తులు మటుమాయం అవుతాయి. థైరాయిడ్ ప్రాబ్లమ్ తగ్గిపోతుంది.

పుదీనా ఆకులు.. డయోబెటిస్ పేషెంట్లకు దివ్య ఔషదంతో సమానం. వీటిని నమలడం వల్ల ఇన్సులిన్ స్రావం పెరుగుతుంది. 

థైరాయిడ్ సమస్య ఉన్నవారు.. పుదీనా ఆకులు నమలడం వల్ల గ్లూకోజ్ స్థాయిలు అదుపులో ఉంటాయి.

తులసి ఆకుల్లోని ఒత్తిడి హార్మోన్ కార్డిసాల్ స్థాయిని తగ్గించే సామర్థ్యం ఉంటుంది. వీటిని నమలడం వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉటాయి.

ఆలివ్ ఆకుల్లోని యాంటీ ఆక్సిడెంట్స్.. థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తిని పెంచుతాయి. షుగర్ లెవల్స్ ని ఇవి కంట్రోల్లో ఉంచడానికి సహాయపడతాయి.

నోట్: పై చిట్కాలు పాటించేముందు మీ దగ్గర్లోని డాక్టర్, నిపుణుడి సలహా కూడా తీసుకోండి.