రోజురోజుకీ పెరుగుతున్న కాలుష్యం, సరిగా లేని ఆహార అలవాట్ల వల్ల జట్టుకి సరైన పోషణ అందడం లేదు.

ఈ కారణం వల్లే మీలోచాలామందికి జట్టు తెల్లగా మారిపోతోంది. తెల్ల జట్టుని నల్లగా చేసేందుకు మార్కెట్ లో రకరకాల ప్రొడక్ట్స్ ఉపయోగిస్తుంటారు.

 కానీ వాటిలో చాలా హానికారక రసాయనాలు ఉంటాయని తెలుసుకోండి. ఇవి మీ జట్టుని దెబ్బతీస్తాయి.

దీంతో పాటే జట్టు రాలడం, పొడి బారడం, మధ్యలో తెగిపోవడం లాంటి వాటికి కూడా కారణమవుతాయి.

అయితే ఈ ప్రాబ్లమ్స్ అన్నింటికి.. నువ్వుల నూనె ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. 

ఈ నూనె వల్ల జట్టు రాలడం తగ్గిపోతుంది. డ్రై నెస్ పోతుంది. చుండ్రు కూడా తగ్గుతుందట.

నువ్వుల నూనెని జట్టుకి పట్టించడం వల్ల విటమిన్ ఈ, విటమిన్ బీ కాంప్లెక్స్, మెగ్నీషియం, కాల్షియం, ప్రోటీన్స్ పుష్కలంగా అందుతాయి.

వీటి వల్ల మీ జట్టుకు సరైన పోషణ అందుతుంది. హెయిర్ కి సంబంధించిన అన్ని సమస్యలు పోతాయి.

నువ్వుల నూనెలో ఉండే గుణాలు.. మన నెత్తిపై బ్యాక్టీరియాని తొలగించడానికి సహాయపడుతుంది.

నువ్వుల నూనె వల్ల చుండ్రు కూడా పూర్తిగా తొలగిపోతుందని నిపుణులు అంటున్నారు.

నువ్వుల నూనెని జట్టుకి పెట్టడం వల్ల జట్టు బలంగా పెరుగుతుంది. నల్లగా మెరుస్తుంది కూడా.

పబ్మెడ్ సెంట్రల్ పరిశోధనల ప్రకారం.. నువ్వుల నూనె జట్టుకు ప్రయోజనకరంగా ఉంటుంది.

జట్టు చాలా వేగంగా పెరిగేందుకు నువ్వుల నూనె సహాయపడుతుంది. హెయిర్ స్ట్రాంగ్ గానూ తయారవుతుంది.

ఇక దీన్ని ఉపయోగించడానికి కప్ పెరుగు తీసుకోండి. దీనిలో 2-3 నువ్వుల నూనె వేసి బాగా కలపండి. ఆ మిశ్రమాన్ని హెయిర్ కి అప్లై చేయండి.

ఇలా చేయడం వల్ల చుండ్రు మటుమాయం అవుతుంది. జట్టుంతా నల్లగా మారుతుంది!

రెండు స్పూన్ల నువ్వుల నూనెలో కలబంద జెల్ మిక్స్ చేసి జట్టుకి పెట్టినా సరే మన హెయిర్ ఆరోగ్యంగా ఉంటుంది.