టాలీవుడ్ టాప్ కొరియోగ్రాఫర్లలో శేఖర్ మాస్టర్ ఒకరు.

అనేక మంది స్టార్ హీరోలకి కొరియోగ్రఫీ చేశారు.

శేఖర్ మాస్టర్‌కి సాహితీ, విన్ని అనే ఇద్దరు పిల్లలు.

వీరిద్దరూ మంచి డ్యాన్సర్లు. గతంలో పలు షోల్లో డ్యాన్స్ చేసి అందరిని ఆకట్టుకున్నారు.

సాహితికి సోషల్ మీడియాలో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.

సాహితీ, విన్నీ ఇద్దరూ కూడా తమ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరయ్యారు.

తాజాగా శేఖర్ మాస్టర్ కూతురు సాహితి  త్వరలో హీరోయిన్‌గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనుందని టాక్ వినిపిస్తోంది.

చూడటానికి చక్కగా కుందనపు బొమ్మలా ఉండే ఆమె హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడం కోసం రంగం సిద్ధమైందని తెలుస్తోంది.

ఓ కొత్త దర్శకుడు.. శేఖర్ మాస్టర్ , సాహితీ లకు కథ చెప్పారని, అది వారికి నచ్చడంతో శేఖర్ మాస్టర్ డైరెక్టర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్.

ఇప్పటికే పలువురు హీరోలకు ఆ దర్శకుడి చేత కథ చెప్పిస్తున్నారని టాలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది