ముంబై క్రూయిజ్ షిప్ రేవ్ పార్టీ డ్రగ్స్

కేసులో బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్

కుమారుడు ఆర్యన్ ఖాన్ నార్కోటిక్స్ 

అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

షిప్ లో రేవ్ పార్టీ, డ్రగ్స్ పై విచారణ

జరుపుతున్న అధికారులు, రేవ్ పార్టీ ఎవరు 

నిర్వహిస్తున్నారు? డ్రగ్స్ ఎవరు తీసుకొచ్చారు?

తీసుకొచ్చారు? దీని వెనుక ఎవరెవరున్నారో

అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు. 

డ్రగ్స్ కేసు అంత సామాన్య విషయం

కాదు. అందుకే తన కొడుకు కేసుని

వాదించడానికి ప్రముఖ క్రిమినల్ లాయర్

సతీష్ మాన్షిండేను రంగంలోకి దింపాడు

షారూక్ ఖాన్. 

సతీష్ మాన్షిండే అసాధ్యాన్ని సుసాధ్యం

చేయగల క్రిమినల్ లాయర్. చాలా  మంది 

ఫిలిం సెలబ్రెటీలు జైలు పాలు కాకుండా

కాపాడిన ఘనత ఈయనదే. 

బాలీవుడ్ బిగ్ హీరోల్లో ఒకరైన

సంజయ్ దత్ బయటకి రావడంలో 

సతీష్ మాన్షిండే  కీ రోల్ ప్లే చేశారు. 

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో

రియా చక్రవర్తి తరుపున వాదిస్తూ,

ఆమెను కాపాడుతూ వస్తోంది

కూడా ఈ లాయరే 

 2002లో సల్మాన్ ఖాన్ డ్రంక్ అండ్ డ్రైవ్

కేసును వాదించి బెయిల్ ఇప్పించడం తో

పాటు కేసును సక్సెస్ గా ముగించడంతో

అందరి దృష్టిని ఆకర్షించారు సతీష్ మాన్షిండే. 

ఇప్పుడు ఆర్యన్ ఖాన్ పై సెక్షన్ 27,  8C,

నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ యాక్ట్

నిబంధనల కింద కేసు నమోదు

చేయబడింది.  

ఈ సెక్షన్ ల కింద నేరం ఋజువైతే

షారూక్ ఖాన్ కొడుకుకి 10 ఏళ్ళ 

పాటు శిక్ష పడే ప్రమాదం ఉంది. 

నేరం చేసినట్టు ఆధారాలు పక్కాగా ఉన్న

కేసుల నుండే సెలబ్రటీలను

బయటపడేసిన సతీష్ మాన్షిండేకి ఇప్పుడు 

షారూక్ కొడుకుని ఈ కేసు నుండి కాపాడటం

పెద్ద కష్టం కాదన్న టాక్ వినిపిస్తోంది. 

నేరం చేసినట్టు ఆధారాలు పక్కాగా ఉన్న

కేసుల నుండే సెలబ్రటీలను

బయటపడేసిన సతీష్ మాన్షిండేకి ఇప్పుడు 

షారూక్ కొడుకుని ఈ కేసు నుండి కాపాడటం

పెద్ద కష్టం కాదన్న టాక్ వినిపిస్తోంది. 

 సతీష్ మాన్షిండే ప్రఖ్యాత లాయర్

రామ్ జెఠ్మలానీ వద్ద శిక్షణ పొందారు.

జెఠ్మలానీ వద్ద దాదాపు ఒక దశాబ్దం పాటు

అప్రెంటీస్ గా  పని చేసి ఎన్నో మెలుకువలు

నేర్చుకున్నారు. 

జెఠ్మలానీ వద్ద రాటుదేలిన మాన్షిండే.. 

 బీ టౌన్ సెలబ్రెటీల కేసుల పై మాత్రమే

 స్పెషల్ ఫోకస్ పెట్టడానికి మరో

ప్రత్యేక కారణం ఉంది. 

సినీ స్టార్స్ కేసులలో విజయం సాధిస్తే 

దేశం అంతటా తన పేరు మారు 

మ్రోగిపోతుంది అనేది సతీష్ మాన్షిండే

నమ్మకం. 

ఇంత సక్సెస్ ఫుల్ లాయర్ కాబట్టి 

సతీష్ మాన్షిండే ఫీజీ పదుల కోట్లలో

ఉంటుంది. రేటు ఎక్కువైనా.., ఒక్కసారి

సతీష్ మాన్షిండే ఫీల్డ్ లోకి దిగితే 

కేసు గెలిచినట్టే అని చెప్పుకోవచ్చు.