బైక్ మీద వెళ్తున్నప్పుడు వర్షం పడితే చాలా ఇబ్బందిగా ఉంటుంది.

వర్షపు చినుకులు కళ్ళకు రాళ్ళలా తగులుతుంటాయి. 

అలాంటప్పుడు నడపడం చాలా కష్టమవుతుంది.

ఎండలో కూడా బైక్ నడుపుతుంటే వీపు కాలిపోతుంటుంది. వీటికి తోడు కాలుష్యం ఆయువు తగ్గిస్తుంది.

ఇక రాత్రి పూట ప్రయాణం అయితే పురుగుల బెడద ఎక్కువగా ఉంటుంది.

ఈ సమస్యలన్నిటికీ ఒక్కటే పరిష్కారం. సెపాల్ వెదర్ ప్రొటెక్షన్ షీల్డ్. ఇది అన్ని వాతావరణ పరిస్థితుల నుంచి బైకర్లను కాపాడుతుంది.

ఇది ఉంటే వర్షం పడుతుందనో, ఎండ ఎక్కువగా ఉందనో, రాత్రి పూట పురుగులు కళ్ళలో పడతాయన్న ఆందోళన అవసరం లేదు.

కాలుష్యం బారిన పడతారేమో అన్న భయం అక్కర్లేదు.

ఒకే ఒక్క పరికరంతో మీరు ఎండ, వాన, దుమ్ము, ధూళి, కాలుష్యం, పురుగుల బెడద వంటివి లేకుండా హ్యాపీగా బైక్ నడపచ్చు.

సెపాల్ అనే కంపెనీ ఎండ, వర్షం, కాలుష్యం భారిన పడకుండా ఉండేలా సెపాల్ వైండ్ షీల్డ్ ని తయారు చేసింది.

వర్షాన్ని ఆపడానికి ముందు ఒక నాన్ బ్రేకబుల్ గ్లాస్ ఉంటుంది. అలానే పైన ఒకటి రూఫ్ లా ఉంటుంది. చాలా దృఢంగా ఉంటుంది.

దీన్ని బైక్ యొక్క పెట్రోల్ ట్యాంక్ కి అమర్చాలి. ఐదు నిమిషాల్లో దీన్ని అమర్చుకోవచ్చు.

హైట్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. ఒక మొబైల్ హోల్డర్ కూడా ఉంటుంది.

మొబైల్ కనెక్టివిటీ కూడా ఉంటుంది. ఐవోటీ అనే డివైజ్ ద్వారా మొబైల్ లోని పాటలను వినచ్చు. మ్యాప్ నావిగేషన్ ను కంట్రోల్ చేయవచ్చు. ఇది యాంటీ థెఫ్ట్ లాక్ తో వస్తుంది.

వర్షంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ప్యాంట్ తడవకుండా ఉండేందుకు థైస్ ప్లాప్స్ కూడా ఉన్నాయి.

ఈ షీల్డ్ ప్రత్యేకత, ధరల గురించి పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.