నూతన ఏడాదిలో కూడా టాలీవుడ్‌ ఇండస్ట్రీని విషాదాలు వదలడం లేదు. మరో విషాదం చోటు చేసుకుంది

తెలుగు ప్రేక్షకుల మదిలో సత్యభామగా గుర్తింపు తెచ్చుకున్న సీనియర్‌ నటి జమున​ మృతి చెందారు.

జనవరి 27, 2023 శుక్రవారం ఉదయం.. హైదరాబాద్‌లోని ఆమె స్వగృహంలో కన్ను మూశారు.

జమున తన కెరీర్‌లో తెలుగు, తమిళ్‌, హిందీలో కలిపి సుమారు 180కిపైగా చిత్రాల్లో నటించారు

జమున 1936 ఆగష్టు 30 న హంపీలో జన్మించారు. తల్లితండ్రులు నిప్పని శ్రీనివాసరావు, కౌసల్యాదేవి.  

ఇక జమున బాల్యం అంతా గుంటూరు జిల్లా దుగ్గిరాలలో గడిచింది.

సినీ నటుడు జగ్గయ్యదీ కూడా జమున గ్రామమే. దాంతో.. ఆమె కుటుంబానికి జగ్గయ్యతో ఎంతో కాలంగా పరిచయం ఉంది.

ఇక చిన్నప్పటి నుంచి బెరుకు అంటే తెలియని జమున పాఠశాలలో చదివేటప్పటి నుంచే నాటకాల వైపు ఆకర్షితురాలయ్యారు.

ఈ క్రమంలో తెనాలి సమీపంలోని మండూరు గ్రామంలో ‘ఖిల్జీ రాజ్య పతనం’ అనే నాటిక ప్రదర్శన కోసం జగ్గయ్య.. జమునను తీసుకువెళ్ళాడు.

ఇక ఇదే నాటికలో మరో ప్రముఖ నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు కూడా నటించాడు.

ఇక నాటకాలలో ఆమె ప్రతిభ అందరికి తెలియడంతో..  సినిమా అవకాశాలు జమునను వెతుక్కుంటూ వచ్చాయి.

బి.వి.రామానందం తీసిన పుట్టిల్లు జమున తొలిచిత్రం.

ఆ తరువాత ఏఎన్నార్‌, ఎన్టీఆర్‌, జగ్గయ్య వంటి అగ్ర నటుల సరసన హీరోయిన్‌గా నటించారు జమున.

అయితే జమున తన కెరీర్‌లో ఎన్ని పాత్రలలో నటించినప్పటికి.. ఆమెకు బాగా పేరు తెచ్చింది మాత్రం..సత్యభామ పాత్రే.

సత్యభామ అంటే ఇప్పటిటికీ ఆమెను తప్ప మరొకరిని ఊహించుకోలేము అన్నట్టుగా ఆ పాత్రలో జీవించారు జమున.