ఇండియా-పాకిస్థాన్‌ మ్యాచ్‌కు భారీ క్రేజ్‌  ఉంటుందన్న విషయం తెలిసిందే.

 ఆసియా కప్‌లో భాగంగా ఈ నెల 28న  భారత్‌-పాక్‌ మ్యాచ్‌ జరగనుంది. 

 ఆసియా కప్‌లో భాగంగా ఈ నెల 28న  భారత్‌-పాక్‌ మ్యాచ్‌ జరగనుంది. 

ఈ నేపథ్యంలో భారత్‌-పాక్‌ మ్యాచ్‌పై  టీమిండియా మాజీ డాషింగ్‌ ఓపెనర్‌  వీరేంద్ర సెహ్వాగ్‌ స్పందించాడు.

 భారత్‌-పాక్‌ మ్యాచ్‌ ఎప్పుడు జరిగినా  భావోద్వేగాలు తీవ్ర స్థాయిలో ఉంటాయి. 

 ఒక సారి భారత్‌-పాక్‌లో సచిన్‌  టెండూల్కర్‌ను ఆఫ్రిది పదే పదే  తిడుతున్నాడు. 

అప్పుడు నేను సచిన్‌కు బై రన్నర్‌గా  ఉన్నాను. 

నేను క్రీజ్‌లోకి వచ్చే సమయానికే షాహిద్‌  ఆఫ్రిది.. సచిన్‌ను తిడుతున్నాడు. 

కానీ సచిన్‌ మాత్రం అది పట్టించుకోకుండా  ఏకాగ్రతతో బ్యాటింగ్‌ చేస్తున్నాడు.

సచిన్‌ క్రీజ్‌లో ఉండటం టీమిండయాకు  ఎంతో అవసరం. ఆ విషయం అందరికంటే  సచిన్‌కే బాగా తెలుసు. 

అందుకే ఆఫ్రిది ఎంత కవ్విస్తున్నా, సచిన్‌  మాత్రం బ్యాటింగ్‌పైనే దృష్టి పెట్టాడు. 

పాకిస్థాన్‌తో మ్యా​చ్‌ అంటే మాకు కూడా  ఎంతో ఒత్తిడి ఉంటుంది.

కానీ.. సచిన్‌ అలా కాదు. జట్టుకు తన  అవసరం ఎంతుందో అతని బాగా తెలుసు  అందుకే అతను మిగతావి పట్టించుకోడు.

తనను కావాలని ప్రత్యర్థి ఆటగాళ్లు  రెచ్చగొట్టినా సచిన్‌ అనవసరపు పంతాలకు  పోయి వికెట్‌ పారేసుకోడు. 

జట్టు పరిస్థితులకు తగ్గట్టు తన పని తాను  చేసుకుంటూ పోతాడు. 

అందుకే సచిన్‌ ప్రపంచ క్రికెట్‌లో ఒక  లెజెండ్‌ అయ్యాడు. ఇండియన్‌ క్రికెట్‌కు  గాడ్‌ అయ్యాడు.