దుల్కర్ సల్మాన్ రాముడిగా, మృణాల్  ఠాకూర్ సీతగా.. హను’మంతుడి (హను  రాఘవపూడి) దర్శకత్వంలో వచ్చిన  కలియుగ రామాయణ గాథ ఈ సీతారామం.

హను రాఘవపూడి మరో ప్రేమ కావ్యంతో మన  ముందుకు వచ్చారు? మరి యుద్ధంతో రాసిన  ప్రేమకథ ఎలా ఉంది? మెప్పించిందా? లేదా?  అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

కథ:

1965 నుండి 1985 మధ్యలో జరిగిన కథ ఈ  సీతారామం. అప్పుడు ఇండియా, పాకిస్థాన్ ల  మధ్య కశ్మీర్ కోసం యుద్ధం జరుగుతుంది.  కశ్మీర్ ని ఆక్రమించాలని పాకిస్థాన్ భావిస్తుంది.

ఆ సమయంలో పాకిస్థాన్ సైనికులతో భారత  సైనికులు పోరాడాల్సి వస్తుంది. అందులో ఒక  సైనికుడే మన రామ్ దుల్కర్ సల్మాన్. ఇతనొక  అనాథ.

1965లో సీత కోసం రామ్ రాసిన ఉత్తరం 20  ఏళ్లు తర్వాత అంటే 1985లో చేర్చే బాధ్యత  పాకిస్థానీ యువతి తీసుకుంటుంది. ఆ యువతి  ఎందుకు ఈ బాధ్యత తీసుకుంది? ఆ  ఉత్తరాన్ని సీతకు ఇచ్చిందా?

రామ్ రాసిన ఉత్తరం సీతకు చేరడానికి 20 ఏళ్లు  పట్టడానికి కారణాలు ఏంటి? చివరకి రామ్,  సీతని కలుసుకున్నాడా? లేదా? అనేది తెరపై  చూడాల్సిందే.

రామ్ గా దుల్కర్ సల్మాన్, సీతామహాలక్ష్మిగా  మృణాల్ ఠాకూర్, అఫ్రీన్ గా రష్మిక, విష్ణు శర్మ  పాత్రలో సుమంత్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్  తో ఆకట్టుకుంటారు.

ఇక తరుణ్ భాస్కర్ చివరి వరకూ ట్రావెల్  చేస్తాడు. బాలాజీగా ఆయన పండించిన కామెడీ  బాగుంటుంది. ఇక సునీల్ కూడా తన మార్క్  కామెడీతో నవ్వించి వెళ్ళిపోతారు. వెన్నెల  కిషోర్ టైమింగ్ బాగుంది.

కథని ఆద్యంతం ఉత్కంభరితంగా  సాగించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యారు.  కథలో ట్విస్ట్ లు థ్రిల్ కి గురిచేస్తాయి.

ప్రేమకథలతో తనకంటూ ఒక బెంచ్ మార్క్  సెట్ చేసుకున్న హను రాఘవపూడి ఈ  సినిమాతో నెక్స్ట్ లెవల్ కి వెళ్ళారు.

ఇక సినిమాటోగ్రఫీ విషయానికొస్తే పీఎస్  వినోద్, శ్రేయాస్ కృష్ణ అద్భుతంగా  చిత్రీకరించారు.

ఎడిటింగ్ కూడా బాగుంటుంది. ఫైనల్ గా  నిర్మాణ విలువలు బాగున్నాయి.

రేటింగ్: 3/5