కరోనా మొదలైనప్పటి నుంచి ప్రజలు ఇమ్యూనిటీ పెంచుకునే ఆహార పదార్థాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు.

సీమ చింత జిలేబీలా గుండ్రంగా తిరిగి ఉంటాయి. కాస్త తీపిగా.. వగరుగా ఉంటాయి. 

బాగా పండి ఎరుపు వర్ణంలోకి వచ్చిన పండ్లు చాలా రుచిగా ఉంటాయి. ఇది చాలా మెత్తగా ఉంటుంది కనుక చిన్నా పెద్ద తినడానికి ఇష్టపడతారు. 

ఇవి చాలా వరకు పొలం గట్ల వెంట ఉంటాయి.. సీమ చింతకాయలో  నీటిశాతం ఎక్కువ.. మంచి ఔషద గుణాలు ఉన్నాయి. 

ఐరన్, నియాసిన్, క్యాల్షియం, ఫాస్పరస్, నియాసిన్ విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి. 

వేస‌వి కాలంలో   సీమ చింత‌కాయ‌లే విరివిగా ద‌ర్శ‌న‌మిస్తుంటాయి.

యాంటీ ఆక్సిడెంట్స్ అనేక  పోష‌కాలు నిండి ఉండే సీమ చింత‌కాయ‌లు ఆరోగ్యానికి చక్కటి మేలు చేస్తాయి. 

రోగ నిరోధక శక్తి పెంచుకోవాలంటే..    రోజు ఒకటి, రెండు చొప్పున సీమ చింత‌కాయ‌ల‌ను తీసుకుంటే మంచిది

సీమ చింతకాలు తింటే..    ఒత్తిడి, డిప్రెష‌న్‌, ఆందోళ‌న వంటి స‌మ‌స్య‌లు దూరమవుతాయని అంటారు.

డయాబెటీస్ ఉన్నవారు సీమ చింతకాలు తీసుకుంటే రక్తంలో చెక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.

ఇందులో కొవ్వు పదార్థాలు తక్కువగా..  పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి.

గొంతు, చిగుళ్లు, నోటిపూత నివారణకు సీమ చింతకాలు ఎంతో ఉపయోగపడతాయి.

సీమ చింతలో ఉండే ఫైబర్  మలబద్ధకాన్ని నివారిస్తుంది.