ప్రస్తుతం అందరికీ ఆరోగ్యం మీద శ్రద్ధ పెరింగింది. అంతా చిరు ధాన్యాల వాడకం మొదలు పెట్టారు.

ప్రస్తుతం అందరికీ ఆరోగ్యం మీద శ్రద్ధ పెరింగింది. అంతా చిరు ధాన్యాల వాడకం మొదలు పెట్టారు.

అయితే అన్ని చిరు ధాన్యాల్లోకీ రాగులు ఎంతో శక్తివంతమైనవి.

రోజూ రాగులను తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం.

రాగుల్లో ఉండే అమైనో యాసిడ్లు త్వరగా ఆకలి వేయకుండా ఆపుతాయి. తద్వార తక్కువ తింటారు.

బరువు తగ్గాలి అని కోరుకునే వారికి రాగులు సరైన సమాధానంగా చెప్పొచ్చు.

జుట్టు పెరుగుదలకు కూడా రాగులు దోహదపడతాయి.

వయసు పెరిగే కొద్దీ.. మనుషుల ఎముకల్లో పట్టు తగ్గుతూ ఉంటుంది.

ఎముకలు పటిష్టంగా అయ్యేందుకు రాగులు ఎంతగానో ఉపయోగపడతాయి.

అలాగే రాగులను రోజూ ఆహారంలో చేర్చుకోవడం వల్ల.. నిద్రలేమి, ఆందోళన వంటి సమస్యలు తగ్గుతాయి.

ముఖ్యంగా షుగుర్ వ్యాధి ఉన్నవారు.. వీటిని తీసుకోవడం వల్ల షుగర్ కంట్రోల్ లోఉంటుంది.

అలాగే పిల్లలకు రాగులతో చేసిన ఆహారం పెట్టడం వల్ల పెరుగుదల బాగుంటుంది.

రాగులను సంగటి, రాగి జావ, రొట్టెలుగా చేసుకుని తింటూ ఉంటారు.

రాగి జావలో కాస్త పెరుగు, లేదా మజ్జింగ కలిపి తాగితే ఒంట్లో వేడి తగ్గుతుంది.

రాగి సంగటిని కనీసం రెండ్రోజులకు ఒకసారి తీసుకోవడం మంచిదని వైద్యులు కూడా సూచిస్తున్నారు.

బాడీ డీహైడ్రేట్ కాకుండా.. రాగి పానీయం అరికడుతుంది. నీరసాన్ని కూడా తగ్గిస్తుంది.