ఏదో ఒక వంకతో లోన్లు తీసుకోవడం.. వాటిని తిరిగి చెల్లించకపోవడం.. బడా బడా వ్యాపారస్తులకు, రాజకీయ నాయకులకు ఇది సదా మాములే.
ఏర్పాటు చేసిన సంస్థల నుంచి ఆదాయం వస్తున్నా లోన్లు మాత్రం తిరిగి చెల్లించారు. ఈ చట్టాలు మమ్మల్ని ఏం చేయలేవన్నా ధీమాతో తిరుగుతుంటారు.
అంతకు బ్యాంకులు చర్యలకు ఉపక్రమిస్తే.. మూడో కంటికి తెలియకుండా విదేశాలకు పారి పోతుంటారు. ఇలాంటి ఘటనలు ఇప్పటికే ఎన్నో చూశాం..
విజయ మాల్యా, నీరవ్ మోడీ, నీరవ్ చోక్సి అలాంటి వారే. ఇక రాజకీయ నాయకుల విషయానికొస్తే మన తెలుగు రాష్ట్రాల్లోనే ఎందరో ఉన్నారు.
ఇలాంటి రుణ ఎగవేత దారులందరికి క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ మండలి ‘సెబీ’ పరోక్షంగా హెచ్చరికలు పంపింది.
లోన్లు తీసుకొని కట్టకుండా తప్పించుకొని తిరుగుతున్న రుణ ఎగవేత దారులను పట్టుకోవడం కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
అసెట్ డిఫాల్టర్ల సమాచారం తెలిపిన వారికి రూ.20 లక్షల వరకు నజరానా అందించనున్నట్లు ప్రకటించింది.
ఈ రివార్డును రెండు దశల్లో చెల్లించనున్నట్లు వెల్లడించింది.
మొదట డిఫాల్టర్ అసెట్ రిజర్వ్ ధరలో 2.5 శాతం లేదా రూ.5 లక్షల్లో ఏది తక్కువైతే అది చెల్లించనుండగా, తుది రివార్డు కింద రికవరీ అయిన బకాయిల్లో గరిష్ఠంగా 10 శాతం లేదా రూ.20 లక్షల్లో ఏది తక్కువైతే ఆ మొత్తాన్ని చెల్లించనుంది.
ఈ మేరకు 515 మంది ఎగవేతదార్ల జాబితాను విడుదల చేసింది. వీరికి సంబంధించిన సమాచారాన్నే మీరు తెలియజేయాలి.
కావున.. డిఫాల్టర్ల ఆస్తులకు సంబంధించి మీకు ఏవైనా వివరాలు తెలిస్తే, అవి సెబీకి తెలియజేసి రూ.20 లక్షలు సొంతం చేసుకోండి.