స్నానం చేయడం వల్ల ఒంటికి వ్యాయామం జరగడమే గాక శరీరం శుభ్రంగా ఉంటుంది. అయితే ఇలా స్నానం చేస్తే మాత్రం చర్మ సమస్యలు వస్తాయి.

కొంతమంది మురికి వదులుతుందని చర్మాన్ని గట్టిగా రుద్దుతారు. ఇలా చేయడం వల్ల చర్మానికి హాని కలుగుతుందని వైద్యులు చెబుతున్నారు.

లూఫా, బాతింగ్ స్క్రబ్బర్ తో ఒళ్ళు తోముకుంటారు. దీని వల్ల చర్మం పాడవుతుందని డాక్టర్లు చెబుతున్నారు.   

లూఫా, స్క్రబ్బర్ చర్మంపై పొరను దెబ్బ తీస్తుందని, యూవీ కిరణాలకు చర్మం సున్నితంగా మారుతుందని చెబుతున్నారు.

ఈ కారణంగా దద్దుర్లు, వడదెబ్బ, స్కిన్ ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు వస్తాయి.  

అలానే ఒంటిపై ఉన్న నల్లటి ప్రాంతాన్ని ఎంత రుద్దినా నల్లటి మచ్చ పోవడం సంగతి అటుంచితే ఆ నలుపు ఇంకా పెరుగుతుందని అంటున్నారు.

ఇక మెడ, మోచేతులు, మోకాళ్ళను గట్టిగా తోమడం వల్ల చర్మం దెబ్బ తింటుందని చెబుతున్నారు.

స్క్రబ్బర్ తో గట్టిగా తోమడం వల్ల ఆ రాపిడికి హైపర్ పిగ్మెంటేషన్ కు దారి తీస్తుంది. దీని వల్ల చేతులు, వీపు మీద మాక్యులర్ అమిలోయిడిస్ వచ్చే ఛాన్స్ ఉంది.

అమిలాయిడ్ అనే ప్రోటీన్ పిగ్మెంట్ క్షీణిస్తుంది. ఈ సమస్యను నియంత్రించాలంటే గట్టిగా ఒంటిని తోమడం, అధికంగా లూఫా, స్క్రబ్బింగ్ చేసుకోకపోవడం మంచిదని వైద్యులు చెబుతున్నారు.

రాపిడిని తగ్గించడం కోసం మోచేతులు, మోకాళ్లపై అధిక ఒత్తిడి పెట్టకపోవడం మంచిది.

మోచేతులు, మోకాళ్ళకు మాయిశ్చరైజర్ రాసుకోవాలి.

విటమిన్ ఏ, విటమిన్ ఈ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల స్కిన్ ఇన్ఫెక్షన్ సమస్యలకు చెక్ పెట్టవచ్చునని వైద్యులు సూచిస్తున్నారు.         

గమనిక: అంతర్జాలంలో దొరికిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. అవగాహన కోసం నిపుణులను సంప్రదించవలసినదిగా మనవి.