విమానంలో ప్రయాణించాలనే కోరిక చాలా మందికి ఉంటుంది.

అయితే విమానంలో  ఎక్కి ఆకాశంలో విహరించాలనుకోవడం పేద వారికి  కలే.

ఈ  మధ్యకాలంలో విమాన టికెట్ ధరలు చాలా వరకు తగ్గాయి.

ఇప్పటికే  పలు విమానయాన సంస్థలు కస్టమర్లను ఆకర్షించడం కోసం వివిధ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి.

కొన్ని ప్రాంతాలకు తక్కువ ధరకే విమానంలో ప్రయాణించే అవకాశం స్కూట్ అనే సంస్థ కల్పిస్తోంది.

ఈ స్కూట్ అనేది సింగపూర్ ఎయిర్‌లైన్స్ అనుబంధ ఉండే సంస్థ.

తూర్పు ఆసియా, ఆగ్నేయాసియా ప్రాంతాలకు టికెట్లు బుక్ చేసుకునే వారికి డిస్కౌంట్‌ ధర అందిస్తోంది.

మన దేశంలోని విశాఖపట్నం, తిరువనంతపురం, అమృత్‌సర్, తిరుచిరాపల్లి నుంచి ప్రయాణించే వారికి ఈ అవకాశం.

విశాఖపట్నం నుంచి సింగపూర్‌కు కేవలం 6200 రూపాయలకే ప్రయాణించే అవకాశం కల్పిస్తోంది.

ఈ ఛార్జీ ఒక వైపు  ప్రయాణం చేయడానికి మాత్రమే. ఈ ఛార్జీలకు పన్నులు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

అదే విధంగా స్కూట్‌ ప్లస్‌లో భాగంగా ప్రయాణికులు 30 కిలోల చెకిన్‌ బ్యాగేజ్‌ తీసుకెళ్లవచ్చు.

అలానే స్కూట్ సంస్థ భోజనం లాంటి సౌకర్యాలు కూడా అందిస్తుంది.

ఇండియన్ రైల్వే కి చెందిన IRCTC కూడా విహార యాత్రలను దృష్టిలో పెట్టుకుని మంచి ప్కాకేజీలను అందిస్తుంది.

అందులో భాగంగా కశ్మీర్, కేరళ, థాయ్‌లాండ్ వంటి ప్రదేశాలకు.. చాలా తక్కువ ధరలోనే వెళ్లి రావొచ్చు.