మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తోంది.
మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దే పథకం
భారతీయ మహిళా బ్యాంకు సొంతంగా వ్యాపారం చేయాలనుకునే మహిళలకు బిజినెస్ లోన్ ఇస్తోంది. ఈ పథకం కింద రూ. 20 కోట్ల వరకూ రుణాన్ని మహిళలకు అందజేస్తారు.
మైక్రో, చిన్న తరహా పరిశ్రమలకు ఎలాంటి తనఖా లేకుండా రూ. కోటి వరకూ రుణాన్ని అందిస్తారు. వడ్డీ రేటు 10.15 శాతం ఉంటుంది.
అన్నపూర్ణ పథకం కేటరింగ్ వ్యాపారం చేయాలనుకునే మహిళల కోసం అన్నపూర్ణ పథకం పేరుతో ప్రభుత్వం రూ. 50 వేల రుణాలను అందిస్తోంది.
బ్యాంకులు, ప్రాంతాన్ని బట్టి వడ్డీ రేటులో మార్పు ఉంటుంది. ఈ రుణాన్ని మూడేళ్ళ లోపు ఎప్పుడైనా చెల్లించవచ్చు.
వర్కింగ్ ఉమెన్ హాస్టల్ పథకం ఉద్యోగం చేసే మహిళల కోసం ప్రత్యేకంగా వర్కింగ్ ఉమెన్ హాస్టల్ పథకాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది.
ఈ పథకం కింద పిల్లల సంరక్షణకు సంబంధించి ఏర్పాట్లు ఉంటాయి. ఆదాయం నెలకు రూ. 50 వేల కంటే తక్కువ ఉన్న మహిళలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.
మహిళా శక్తి కేంద్రాలు కేంద్ర ప్రభుత్వం మహిళా శక్తి కేంద్రాలు పథకం ద్వారా మహిళలకు కావాల్సిన నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు.
ఆయా ప్రాంతాల్లో మహిళా శక్తి కేంద్రాలను ఏర్పాటు చేసి వారికి కావాల్సిన స్కిల్స్ లో శిక్షణ ఇచ్చి ఉపాధి, ఉద్యోగ అవకాశం కల్పిస్తుంది ప్రభుత్వం.
మహిళా ఈ హాత్ ఈ మహిళా ఈ హాత్ పథకం అనేది ఒక ద్విభాషా మార్కెటింగ్ ప్లాట్ ఫామ్. మహిళా వ్యాపారవేత్తలు, స్వయం సహాయక సంఘాలు, లాభాపేక్ష లేనటువంటి సంస్థలు తమ ఉత్పత్తులను ప్రమోట్ చేసుకునేందుకు ఏర్పాటు చేయబడిన వేదిక ఈ మహిళా ఈ హాత్.
ఎస్బీఐ స్త్రీ శక్తి పథకం తమ వ్యాపారాన్ని విస్తరించాలనుకునే మహిళల కోసం స్త్రీ శక్తి పథకం కింద ఎస్బీఐ బ్యాంకు రూ. 50 లక్షల వరకూ వ్యక్తిగత రుణం ఇస్తుంది. ఎలాంటి తనఖా లేకుండా రూ. 5 లక్షల వరకూ రుణమిస్తారు.
ఓరియంట్ మహిళా వికాస్ యోజన పథకం చిన్న చిన్న వ్యాపారాలను చేయాలనుకునే మహిళలకు ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ ఈ కామర్స్ ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం కింద ఎలాంటి తనఖా లేకుండా రూ. 25 లక్షల వరకూ రుణం ఇస్తారు.
ఇవే కాకుండా ముద్ర లోన్, డేనా శక్తి పథకం, మహిళా ఉద్యమ్ నిధి యోజన, సెంట్ కళ్యాణి యోజన, ప్రధానమంత్రి రోజ్ గార్ యోజన, ఉద్యోగిని స్కీం, సింధ్ మహిళా శక్తి పథకం వంటి పథకాలు ఎన్నో అమలులో ఉన్నాయి.
ఇవి కాకుండా పొదుపు ఖాతాలతో ప్రయోజనాలు, తక్కువ వడ్డీ రేటుతో రుణాలు, తక్కువ బీమా ప్రీమియం, సుకన్య సమృద్ధి యోజన పథకం వంటి ప్రయోజనాలు ఉన్నాయి.