దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్.. ఎస్బీఐ తమ ఖాతాదారులకు కొత్త సేవలు అందుబాటులోకి తెచ్చింది.

సీనియర్ సిటిజన్ల కోసం వాట్సాప్ సేవలు అందుబాటులోకి తెచ్చింది.

దీంతో సీనియర్ సిటిజన్లు ప్రతి నెలా పెన్షన్ స్లిప్ కోసం బ్యాంకు శాఖకు వెళ్లనవసరం లేకుండా ఇంటి నుంచే పొందేందుకు వీలు కలగనుంది.

దీని ద్వారా పెన్షన్ స్లిప్ పొందాలనుకునే ఖాతాదారులు తమ బ్యాంకులో రిజిస్టర్డ్ అయిన మొబైల్ నంబర్ నుంచి + 91 9022690226 అనే మొబైల్ నంబర్‌కు ‘Hi’ వాట్సాప్ మెసేజ్ పంపాలి.

ఆలా పంపిన యూజర్లకు పెన్షన్ స్లిప్ మాత్రమే కాక, మినీ స్టేట్మెంట్, బ్యాలెన్స్ ఎంక్వైరీ తదితర సేవలు కూడా పొందొచ్చు.

ఇందుకోసం వినియోగదారులు వారి బ్యాంక్ అకౌంట్ కు జత చేసిన ఫోన్ నెంబర్ ను రిజిస్టర్ చేసుకోవాలి.

తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి WAREG అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ అకౌంటర్ నంబర్ టైప్ చేసి 72089 33148 నంబర్ కు మెసేజ్ చేస్తే సరిపోతుంది.

కనుక ముందు మీ బ్యాంకు శాఖలో మీ మొబైల్ ఫోన్ నంబర్ అప్డేట్ చేసుకోవడం మరువొద్దు.

దీంతో ఎటువంటి అవాంతరాలు లేకుండా, ఎప్పుడైనా, ఎక్కడి నుంచైనా వాట్సాప్ ద్వారా సీనియర్ సిటిజన్లు తమ పెన్షన్ స్లిప్ పొందే వెసులుబాటు లభిస్తుంది.