ప్రముఖ తమిళ నటుడు ఆర్. శరత్  కుమార్.. తెలుగు, తమిళ,  మలయాళ, కన్నడ భాషల్లో వందకు  పైగా సినిమాల్లో నటించారు.

సినీ ఇండస్ట్రీలో నటులకి ఆర్ధిక  ఇబ్బందులు పలకరించి వెళ్ళడం  అనేది తరచుగా వింటూ ఉంటాం

రత్ కుమార్‌కి కూడా ఒకానొక  సమయంలో ఆర్ధిక ఇబ్బందులు  ఎదురయ్యాయట. ఈ విషయాన్ని  ఆయనే ఒక ఇంటర్వ్యూలో  వెల్లడించారు.

ఆ సమయంలో చిరంజీవి సహాయం  చేయకపోతే ఇవాళ తాను ఈ స్థితిలో  ఉండేవాడిని కాదని, చిరంజీవి చేసిన  సహాయం వల్లే

తాను ఆర్ధిక సమస్యల ఊబిలోంచి  బయట పడ్డానని చెప్పుకొచ్చారు.

శరత్‌ కుమార్‌ అప్పుల్లో కూరుకుపోయి  ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న సమయంలో ఒక  పెద్ద నిర్మాత ఆయనకు ఒక ఆఫర్‌  ఇచ్చారట.

“శరత్ గారు మీకు ప్రాబ్లమ్స్‌ ఉన్నాయి  కదా. చిరంజీవి గారి డేట్స్ దొరికితే సినిమా  చేస్తాను, లాభాలు వస్తే వాటా ఇస్తాను.

మీ ప్రాబ్లమ్స్‌ అన్నీ క్లియర్  అయిపోతాయి” అని నిర్మాత అన్నారట.

మీ ప్రాబ్లమ్స్‌ అన్నీ క్లియర్  అయిపోతాయి” అని నిర్మాత అన్నారట.

దీంతో శరత్ కుమార్ కాస్త ఊపిరి  పీల్చుకున్నారు. చిరంజీవితో కలిసి  అప్పటికే ‘స్టూవర్టుపురం పోలీస్‌ స్టేషన్‌’,  ‘గ్యాంగ్ లీడర్’ సినిమాలు చేసి ఉన్నారు.

ఈ సినిమాలతోనే చిరంజీవితో స్నేహం  ఏర్పడింది. కానీ తన ప్రపోజల్‌కి  ఒప్పుకుంటారో లేదో అన్న టెన్షన్‌తోనే  ఆయనకి కాల్‌ చేశారు.

కాల్ చేసి మిమ్మల్ని కలవాలని చిరుతో  అన్నారు శరత్ కుమార్. చిరు పిలవడంతో  శరత్ కుమార్ హైదరాబాద్‌ వెళ్ళి చిరుని  కలిశారు.

అప్పుడు చిరు షూటింగ్‌లో ఉన్నారు.  అయితే తాను పర్సనల్‌గా మాట్లాడాలని  చిరుకి చెప్పడంతో చిరు షూటింగ్ క్యాన్సిల్‌  చేసుకున్నారట.

తన కోసం చిరు షూటింగ్ క్యాన్సిల్‌  చేసుకోవడంతో శరత్ కుమార్  ఆశ్చర్యపోయారట. అయితే తనను  ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెట్టించి.

వివరాలు అడిగారట చిరు. చిరుకి తన  పరిస్థితి వివరించారు శరత్ కుమార్. మీ  డేట్స్‌ కావాలని శరత్ కుమార్ అడగడంతో.

ప్రస్తుతం చేస్తున్న సినిమా అయిపోయాక  తప్పకుండా చేస్తా అని మాట ఇచ్చారట.

అయితే పారితోషికం ఎంత తీసుకుంటారు  అని చిరుని అడిగితే.. “నాకే  డబ్బులిస్తావారా?  ప్రాబ్లమ్స్  ఉన్నాయన్నావు కదా.

నేను ఫ్రీగా చేస్తాను. నాకు డబ్బులొద్దు. ఈ  సినిమాకి డేట్స్‌ ఇస్తాను. దీంతో నీ ప్రాబ్లమ్స్‌  అన్నీ క్లియర్ అయిపోవాలి”  అని అన్నారట చిరు.

తన జీవితంలో చిరు చేసిన మేలు  మరచిపోలేనిదని శరత్‌ కుమార్ గుర్తు  చేసుకుని ఎమోషనల్‌ అయ్యారు.

చిరంజీవి గురించి మాట్లాడుతూ.. కన్నీళ్ళు  పెట్టుకున్నారు. చాలా గొప్ప వ్యక్తి అని  కొనియాడారు. ఇలా చిరంజీవి ఎంతోమందికి  సహాయం చేసి గొప్ప మనసు చాటుకున్నారు.

మరి శరత్‌ కుమార్‌కి చిరు చేసిన సహాయంపై  మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.