టాలీవుడ్ సీనియర్ నటుడు శరత్ బాబు మే 22, సోమవారం మధ్యాహ్నం మృతి చెందారు.
గత మూడు నెలలుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన.. హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చికిత్ప పొందుతూ కన్ను మూశారు.
మంగళవారం చెన్నైలో శరత్ బాబుకు అంత్యక్రియలు నిర్వహించారు.
శరత్ బాబుకి సంతానం లేదు. దాంతో ఆయన తదనంతరం ఆస్తికి వారసులు ఎవరు అనే దానిపై జోరుగా చర్చ సాగుతోంది.
ఈ క్రమంలో ఓ యూట్యూబ్ చానెల్ శరత్ బాబు చిన్న సోదరి సరితను ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసింది.
శరత్ బాబు తనకు అమ్మానాన్న అన్ని అని చెప్పుకొచ్చింది సరిత.
చిన్నప్పటి నుంచి శరత్ బాబు దగ్గర తనకు బాగా చేరికని వెల్లడించింది.
తన కొడుకును చదవిస్తున్నారని.. తన కుమార్తె సోనియా పెళ్లి కూడా శరత్ బాబే చేశారని చెప్పుకొచ్చింది.
తన కుమార్తె సోనియా డెలివరీ కోసం శరత్ బాబు బెంగళూరుకు వచ్చారని తెలిపింది.
ఆ తర్వాతే ఆయన అనారోగ్యానికి గురయ్యాడని చెప్పుకొచ్చింది.
అన్నయ్య కోలుకుని తిరిగి మా అందరితో కలిసి ఉంటాడని నమ్మకంతో ఉన్నాం.. కానీ ఇలా జరిగింది అని చెప్పుకొచ్చింది.
అయితే శరత్ బాబుకు పిల్లలు లేరు. ఆయన సోనియాను దత్తత తీసుకోవాలని భావించారు అని తెలిపింది సరిత.
కానీ ఆ ప్రయత్నం మధ్యలో ఆగిపోయింది అన్నది.
సోనియాను దత్తత ఇవ్వమని శరత్ బాబు తనను చాలా సార్లు అడిగారని.. కానీ తాను ఆ విషయాన్ని సీరియస్‌గా తీసుకోలేదని చెప్పుకొచ్చింది.
మరి ఇప్పుడు శరత్ బాబు ఆస్తులకు వారసులు ఎవరు అంటే తనకు తెలియదు అని చెప్పింది సరిత.