ఘాజీ సినిమాతో దర్శకుడిగా సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టారు సంకల్ప్‌ రెడ్డి.

మొదటి సినిమాతోనే దేశ వ్యాప్తంగా సంచలన విజయాన్ని నమోదు చేశారు.

ఇప్పుడు మరో సారి IB71 మూవీతో బాలీవుడ్‌ను షేక్‌ చేస్తున్నారు.

ఈ సినిమా క్రిటిక్స్‌ను ఎంతో ఇంప్రెస్‌ చేసింది.

జాతీయ మీడియా సంస్థలు సైతం మంచి రేటింగ్‌ ఇచ్చాయి.

ఇక, IMBD (ఇండియన్‌ మూమీ డేటా బేస్‌) ఈ సినిమాకు హైయెస్ట్‌ రేటింగ్‌ ఇచ్చింది.

9.0 రేటింగ్‌తో ‘ఐబీ 71’ దేశంలోనే టాప్‌లో ఉంది.

‘ఐబీ 71’ అంతటి సంచలన విజయం సాధించటం వెనుక సంకల్ప్‌ మార్కు పనితనం ఉంది.

 సినిమాకు సినిమాకు మధ్య వేరియేషన్స్‌ చూపుతూ సంకల్ప్‌ దూసుకుపోతున్నారు.

బ్లాక్‌ బాస్టర్‌ సినిమాలను తెరపైకి దింపి బాలీవుడ్‌ను షేక్‌ చేస్తున్నారు.