ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా ఫ్లాట్‌ఫామ్ ఇండియా హెడ్‌గా తెలుగుమూలాలున్న సంధ్యా దేవనాథన్ భాధ్యతలు చేపట్టింది.
మెటా వైస్ ప్రెసిడెంట్‌గా కూడా ఆమె బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
ఇంతకుముందు ఆమె స్థానంలో అభిజిత్ బోస్ పనిచేసేవారు.
మెటా సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ కొద్ది రోజుల క్రితం తమ సంస్థలో పని చేస్తున్న వారిలో దాదాపు 13 శాతం అంటే 11 వేల మందికి పైగా ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు ప్రకటించారు.
ఈ నిర్ణయం తీసుకున్న వారం రోజుల తర్వాత అభిజిత్ బోస్ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
అయితే ఆయన రాజీనామా చేశారా? లేదా తొలగించిన వారిలో ఈయన కూడా ఉన్నారా? అన్నది అంతుచిక్కని ప్రశ్న.
ఆయన తన పదవికి రాజీనామా చేశాక ప్రత్యర్థి కంపెనీ స్నాప్‌లో చేరారు.
అభిజిత్ బోస్ స్థానంలో బాధ్యతలు చేపట్టిన సంధ్యా దేవనాథన్ 1998లో ఆంధ్రా యూనివర్సిటీ నుంచి ఇంజినీరింగ్ పూర్తి చేశారు.
ఆ తర్వాత.. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పట్టా పొందారు. ఆపై లీడర్‌షిప్ కోర్సు కోసం ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీకి చెందిన సైద్ బిజినెస్ స్కూల్ లో శిక్షణ తీసుకున్నారు.
ఆమె 2016 నుంచి మెటాలో పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఆసియా-పసిఫిక్ రీజియన్ లో మెటా గేమింగ్ వర్టికల్‌కు అధిపతిగా ఉన్నారు.
ఆమె జనవరిలో కొత్త బాధ్యతలు స్వీకరించనున్నారు.