ఒక్కడు వంటి బ్లాక్ బస్టర్ తర్వాత గుణశేఖర్ సరైన హిట్ ఇవ్వలేకపోయారు. 2015లో విడుదలైన రుద్రమదేవి సినిమా ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు.
దీంతో దాదాపు 8 ఏళ్ల తర్వాత మళ్ళీ గుణశేఖర్ మైథలాజికల్ మూవీతో మన ముందుకు వచ్చారు. సమంత లీడ్ రోల్ లో నటించిన సినిమా శాకుంతలం సినిమా ఏప్రిల్ 14న విడుదలైంది.
మహాభారతంలోని ఓ ప్రేమ కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉంది? గుణశేఖర్ కి కమ్ బ్యాక్ ఇచ్చిందా? లేదా? రివ్యూలో తెలుసుకుందాం.
కథ శాకుంత పక్షులు తమ బిడ్డను తీసుకుని ఒక చోట వదిలిపెడతాయి. ఆ ప్రదేశంలో కన్వ ముని (కృష్ణంరాజు) ఆశ్రమం వుంటుంది.
ఆ ముని ఆ పాపని పెంచి పెద్ద చేస్తారు. పాపకు శకుంతల(సమంత) అని పేరు కూడా పెడతారు. ఓ రోజు దుష్యంత (దేవ్ మోహన్) అనే రాజు పులుల్ని వేటాడుతూ ఆ ఆశ్రమం దగ్గరకు వస్తాడు.
అక్కడ శకుంతలను చూసి మనసు పడతాడు. ఆ తర్వాత శకుంతల కూడా దుష్యంతుడిని ప్రేమిస్తుంది. అయితే వీరిద్దరి జీవితాల్లో అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. ఈ కారణంగా వారు దూరమవుతారు.
మరి శకుంతల-దుష్యంతుడు చివరకు ఒక్కటయ్యారా లేదా అనేది? తెలియాలంటే మీరు సినిమా చూడాల్సిందే..
విశ్లేషణ ‘శాకుంతలం ‘ మూవీ గురించి చెప్పాలంటే ఇది ఒక అందమైన ప్రేమ కథ. కాకపోతే అందులో ప్రేక్షకులు ఊహించేంత ట్విస్టులు ఉండవు. చిన్న చిన్న ట్విస్టులతో కథ సాఫీగా వెళ్లిపోవడం వల్ల ప్రేక్షకులు బోర్ ఫీలవుతారు.
ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే పసిపాపగా ఉన్న శకుంతలను శాకుంత పక్షులు ఓ చోటకి తెచ్చి విడిచిపెట్టడం, ముని పాపను పెంచి పెద్ద చేయడం.. దుశ్యంతుడు ఆశ్రమానికి రావడం, ప్రేమలో పడడం.. వీటిలో ఏ ఒక్క ఎమోషన్ కి ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేలా ఉండదు.
శకుంతల, దుష్యంతుడు మధ్య లవ్ ట్రాక్ అనేది సరిగా పండలేదు. శకుంతల, దుష్యంతుడు తప్ప మిగతా పాత్రల కోసం తీసుకున్న స్టార్స్ ని సరిగా వాడుకోలేకపోయారు.
గుణశేఖర్ అంటే ఖచ్చితంగా సెట్స్ హైలైట్ గా నిలుస్తాయి. కానీ ఈ సినిమాలో చెప్పుకోదగ్గ సెట్స్ అయితే ఏం లేవు. గ్రాఫిక్స్ కూడా.. రియలిస్టిక్ గా లేవు.
సినిమాలో లాజిక్ లు మిస్ అయ్యారు. నెలల గర్భిణి అయిన శకుంతల.. ఓ సీన్ లో కిలోమీటర్ల కొద్దీ నడిచేస్తూ ఉంటుంది. నడవడమే కాదు, ఏకంగా పరిగెత్తేస్తుంది.
కొన్ని సన్నివేశాలు చూసినప్పుడు.. హిందీ సీరియల్స్, చిన్నప్పుడు టీవీలో చూసిన భాగవతం, పంచతంత్రం సీరియల్స్ ని గుర్తు చేస్తాయి.
నటీనటుల పని తీరు ఈ సినిమాలో సమంత పాత్ర అందరికీ నచ్చుతుంది. ఇప్పటివరకు చేయని ఓ విభిన్న పాత్రలో సమంత నటించింది.
ఓ ప్రేమికురాలిగా, గర్భిణిగా, భర్త దూరమై విరహ వేదన అనుభవించే భార్యగా.. ఇలా డిఫెరెంట్ వేరియేషన్స్ ని అద్భుతంగా పండించింది. దుష్యంతుడిగా చేసిన దేవ్ మోహన్ బాగా నటించాడు.
సాంకేతిక వర్గం పనితీరు సాంకేతిక నిపుణుల గురించి చెప్పాలంటే ముందు గుణశేఖర్ గురించి ముందు చెప్పాలి. తను అనుకున్న కథని అనుకున్నట్టు తీశారు.
మణిశర్మ పాటలు చాలా బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి బాగా సెట్ అయింది. గ్రాఫిక్స్ టీమ్ ఇంకా బాగా వర్క్ చేసి ఉండాల్సింది. 3D సినిమా అన్నారు గానీ పెద్ద తేడా అయితే ఏమీ కనిపించలేదు.
మైనస్ పాయింట్స్ గ్రాఫిక్స్ తేలిపోవడం పర్వాలేదనిపించే సాంగ్స్ అక్కడక్కడా లాజిక్స్ మిస్ అవ్వడం బోర్ కొట్టించే చాలా సీన్స్
గమనిక: ఇది అంతర్జాలం నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. దీని గురించి అవగాహన కోసం వైద్యులను గానీ నిపుణులను గానీ సంప్రదించవలసినదిగా మనవి.