టాలీవుడ్ అగ్ర హీరోయిన్ సమంత ఏం చేసినా సంచలనమే. ఆమెను కోట్లాది మంది ఆరాధిస్తుంటారు.

సినిమాలతో పాటు పలు సేవా కార్యక్రమాలతోనూ తన ఫాలోయింగ్​ను మరింతగా పెంచుకున్నారు సమంత

మయోసైటిస్​తో బాధపడుతుండటంతో కెరీర్​లో కొన్నాళ్లు వెనుకపడిన సమంత.. ఇప్పుడు మళ్లీ వేగం పెంచారు.

వరుసగా సినిమాలను ఒప్పుకుంటున్నారు సమంత. ప్రస్తుతం ఆమె రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ సరసన ‘ఖుషి’ చిత్రంలో నటిస్తున్నారు 

హాలీవుడ్ సూపర్ హిట్ వెబ్ సిరీస్ ‘సిటాడెల్’ హిందీ రీమేక్​లోనూ యాక్ట్ చేస్తున్నారు సామ్.

ఇందులో సమంతతో పాటు బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. 

ఇటీవల ‘శాకుంతలం’తో ఆడియెన్స్​ ముందుకు వచ్చిన సమంతకు నిరాశే మిగిలింది. ‘శాకుంతలం’ మూవీ అట్టర్​ ఫ్లాప్​గా నిలిచింది. 

‘శాకుంతలం’ రిజల్ట్ షాక్ ఇచ్చినా సమంత తగ్గేదేలే అంటున్నారు. తదుపరి చేయబోయే ప్రాజెక్టులపై ఆమె ఫోకస్ పెడుతున్నారు.

సినిమాలతో ఒకవైపు ఎంత బిజీగా ఉన్న స్నేహితులు, కుటుంబీకులతో వీలు కుదిరినప్పుడు గడుపుతుంటారు సమంత. 

సోషల్ మీడియాలో యాక్టివ్​గా ఉండే సమంత.. తాజాగా పెట్టిన ఒక పోస్ట్ వైరల్​గా మారింది. 

సరైన జోడీ కావాలంటూ ఆమె పెట్టిన పోస్ట్ నెట్టింట సంచలనంగా మారింది. 

అయితే సమంత పార్ట్​నర్​ను వెతుకుతోంది తన కోసం కాదు.. తన ఫ్రెండ్, డాక్టర్ జెవెల్ గమాడియా కోసమట.  

గమాడియా తెలివైనవాడని, ఆయన సరైన జోడీ కోసం వెతుకుతున్నామని సమంత ఇన్​స్టాలో పోస్ట్ పెట్టారు. 

వెస్ట్రన్ ఆక్యుపెంచర్ ఎక్స్ పర్ట్ అయిన గమాడియా దగ్గర కత్రినా కైఫ్ చికిత్స తీసుకున్నారట. 

ఆయన వద్ద సమంత కూడా ట్రీట్ మెంట్ తీసుకున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్.