టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత వరుస సినిమాలతో బిజీ అయిపోయింది.

రీసెంట్ గా ‘శాకుంతలం’తో ఆడియెన్స్ ను సామ్ పలకరించింది. అయితే ఆ చిత్రం దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకుంది. 

‘శాకుంతలం’ రిజల్ట్ ఊహించని విధంగా వచ్చినా సమంత జోరు మాత్రం ఆగడం లేదు. ఆమె ప్రస్తుతం ‘ఖుషి’ అనే చిత్రంలో నటిస్తోంది. 

‘ఖుషి’తో పాటు ‘సిటాడెట్’ వెబ్ సిరీస్ ఇండియన్ రీమేక్​లోనూ సామ్ యాక్ట్ చేస్తోంది. 

 ‘ఖుషి’ ఫిల్మ్​లో సమంత, విజయ్​ దేవరకొండలు కలసి నటిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్​టైనర్​గా తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి ఇటీవలే ఒక పాట విడుదలైంది.

‘ఖుషి’ రిలీజ్​కు ఇంకా చాలా సమయమే ఉంది. కానీ వీలు దొరికినప్పుడల్లా ఈ మూవీని ప్రమోట్ చేస్తోంది చిత్ర యూనిట్. 

తాజాగా సమంత, విజయ్​లు కలసి స్టార్ స్పోర్ట్స్​ ఛానెల్​ నిర్వహించిన ఒక కార్యక్రమంలో తెగ సందడి చేశారు. 

క్రికెట్ గురించి తమ అభిప్రాయాలను పంచుకున్నారు సామ్-విజయ్​లు. మహేంద్ర సింగ్ ధోని అంటే తమకు ఇష్టమని వాళ్లిద్దరూ అన్నారు. 

ఐపీఎల్​లో చెన్నై సూపర్ కింగ్స్ తన ఫేవరెట్ టీమ్​ అని సమంత చెప్పుకొచ్చింది

ధోని నచ్చిన ఆటగాడు అయినప్పటికీ విరాట్ కోహ్లీని తాను స్ఫూర్తిగా తీసుకుంటానని తెలిపింది సామ్. 

మూడేళ్ల పాటు ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడినా.. కోహ్లీ స్ట్రాంగ్​గా కమ్​బ్యాక్ ఇచ్చాడని సమంత మెచ్చుకుంది. 

ఆ టైమ్​లో అతడు సెంచరీ కొట్టడంతో తాను ఉద్వేగానికి లోనయ్యాయని చెప్పింది.

కోహ్లీ కమ్​బ్యాక్​లో సెంచరీ కొట్టడం చూసి తాను ఎమోషనల్ అయ్యానని.. ఏడ్చేశానని సమంత వ్యాఖ్యానించింది. 

సమంత, విజయ్​లు కలసి పాల్గొన్న ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.