Large Radish

ఒక సాధారణ మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన సమంత.. ఇండస్ట్రీలో కొన్నేళ్ల పాటు టాప్ హీరోయిన్ గా చెలామణి అయ్యే స్థాయిని అందుకుంది. 

అక్కినేని కోడలిగా వెళ్లి, ఇప్పుడు ఆ బంధాన్ని తెంచుకుని వార్తల్లో నిలిచింది.

Large Radish

ఈ నేపథ్యంలో అసలు జీవితంలో సమంత ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటి? ఎలాంటి స్థితిలో ఆమె ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది? ఇండస్ట్రీలో ఎలా ఎదిగింది? 

ఎలాంటి పరిస్థితుల్లో విడాకులు తీసుకోవాల్సి వచ్చింది?  ఈ ప్రశ్నలన్నింటికి సమంత లైఫ్‌ స్టోరీ ద్వారా సమాధానాలు తెలుసుకుందాం.

సమంత 1987 ఏప్రిల్‌ 28వ తేదీన తమిళనాడులోని మద్రాసులో.. జోసఫ్ ప్రభు- నినెట్టే ప్రభు దంపతులకు జన్మించింది. 

 సమంత పూర్తిపేరు సమంత రూత్‌ ప్రభు.

ఈమెకు జోనథన్‌ ప్రభు, డేవిడ్‌ ప్రభు సోదరులు ఉన్నారు.

మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన సమంత.. చిన్ననాటి నుంచే కళారంగంలో ఎదిగిపోవాలని కలలు కనింది.

అందుకు తన పేదరికం అడ్డుకాకుండా కామర్స్‌ చదువుతూనే..

మోడలింగ్‌లో పార్ట్‌ టైమ్‌ అసైన్మెంట్స్‌ చేయడం ప్రారంభించింది.

ఇక్కడే సమంత చాలా మంది ఫిల్మ్‌ మేకర్స్‌ దృష్టిని ఆకర్షించింది.

అలా దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ సినిమాలో అవకాశం దక్కించుకుంది.

గౌతమ్‌ మీనన్‌ 2010లో ఏం మాయ చేశావే చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కించారు. ఇందులో తెలుగు వర్షన్‌కి సమంత హీరోయిన్‌గా ఎంపికైంది.

ఇక్కడి నుంచి సామ్‌ తలరాత మారిపోయింది. జెస్సీ పాత్రలో అద్భుత నటనతో ఆకట్టుకుంది. యావత్‌ కుర్రకారుతో పాటు..

నాగచైతన్య కూడా ఈ కుందనపు బొమ్మ ప్రేమలో పడిపోయాడు.తర్వాత కాలంలో సామ్‌ కూడా చైతు ప్రేమను అంగీకరించింది. ఇలా ఏడేళ్లపాటు వారి లవ్‌స్టోరీ నడిచింది.

ఆ తర్వాత వీరిద్దరూ తమ ప్రేమ విషయాన్ని పెద్దలకు తెలియజేయడం.. వారు వీరి వివాహానికి అంగీకరించడం చకచకా జరిగిపోయాయి. 2017 అక్టోబరు 7న వీరిద్దరికీ అంగరంగ వైభవంగా వివాహం జరిగింది.

సమాజంలో అక్కినేని కుటుంబానికి ఉన్న గౌరవ మర్యాదలను నాగార్జున- అమల తరహాలోనే నాగ చైతన్య- సమంత కూడా కాపాడుకుంటూ వచ్చారు.

సమంత అక్కినేని కోడలుగా మారాక ఆమెకు ఫాలోయింగ్‌ మరింత పెరిగింది. అక్కినేని అభిమానులు కూడా ఆమెకు అంతే గౌరవం ఇచ్చారు.

అత్తమామలతో సమంత ఎంతో చనువుగా, గౌరవంగా ఉండటం చూసి అభిమానులు కూడా ఎంతో సంతోషించారు. వీళ్లను క్యూట్‌ కపుల్‌ అంటూ మెచ్చుకుంటూ వచ్చారు.

కానీ పెళ్లి తర్వాత కూడా తనకు నచ్చిన రీతిలో సినిమాల్లో నటిస్తూ ముందుకెళ్లింది. ఈ విషయంలోనే అక్కినేని కుటుంబ సభ్యులకు సమంతకు మధ్య విభేదాలు తలెత్తాయి.

ఈ మొత్తం గొడవలో నాగచైతన్య కూడా సమంత వ్యవహారశైలిని వ్యతిరేకించాడని తెలుస్తోంది. తన మామ నాగార్జున కూడా అమలను చూసి నేర్చుకోవాలంటూ సూచించినట్లు సమాచారం.

అయితే సమంత ఈ సూచనలను పట్టించుకోకుండా సూపర్‌ డీలక్స్‌ సినిమా, ఫ్యామిలీ మేన్‌ 2 వెబ్‌ సిరీస్‌లో బోల్డ్‌ క్యారెక్టర్లలో నటించింది.

దీంతో సామ్‌- చైతు మధ్య పూర్తిగా దూరం పెరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే ఈ జంట విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు.

ఎట్టకేలకు విడిపోయారు. అక్టోబరు 2న సోషల్‌ మీడియా వేదికగా తమ విడాకుల విషయాన్ని అధికారికంగా తెలియజేశారు.

సమంత విడాకుల తీసుకోవడం అనేది పూర్తిగా ఆమె వ్యక్తిగత విషయం. కానీ, అక్కినేని కుటుంబాన్ని సినిమా ఇండస్ట్రీతో వేరుచేసి చూడలేము. ఈ కారణంగానే సమంత నిర్ణయాన్ని చాలా మంది వ్యతిరేకించవచ్చు.

అయితే జీవితంలో ఎన్నో ఎదురుదెబ్బలు, ఎన్నో ఆర్థిక కష్టాలు అనుభవించి.. ఈ స్థాయికి వచ్చిన సమంత.. ఎంత ఆలోచించి ఈ నిర్ణయం తీసుకుని ఉంటుంది? ఇంటికి కాల్‌ చేసుకోవడానికి కూడా చేతిలో ఫోన్‌ లేని స్థితిలో సమంత ఇండస్ట్రీలో అడుగు పెట్టింది.

ఒక సాధారణ సమంత రూత్‌ ప్రభు.. సమంత అయినా, స్టార్‌ హీరోయిన్‌ అయినా, అక్కినేని కోడలు అయినా ఇవన్నీ కూడా ఆమెకు సినిమా వల్ల దక్కినవే.

అలాంటి సినిమాని వదులుకోలేక.. సమంత తన వ్యక్తిగత జీవితంలో ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చు. కారాణాలు ఏవైనా.. ఆమె నిర్ణయాన్ని జడ్జి చేయడం మానేసి, తన తర్వాతి జీవితం విజయవంతంగా ముందుకు సాగాలని కోరుకుందాం.