తెలుగు టాప్ హీరోయిన్లలో ముందు వరుసలో ఉంటారు నటి సమంత. ఏ మాయ చేశావేతో అందర్ని మయాలో పడేశారు సామ్
ఇండస్ట్రీలోకి వచ్చిన అనతి కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ రంగంలో నిలదొక్కుకునేందుకు ముందు గ్లామరస్ పాత్రలు చేశారు.
ఆ తర్వాత కథలో తన ప్రాధాన్యత ఉంటేనే సినిమాలు ఒప్పుకోవడం మొదలు పెట్టారు. అలా ఆఆ, రంగస్థలం, మజిలీ వంటి హీరోయిన్ ప్రాధాన్యత సినిమాలు చేశారు.
ఇప్పడు పూర్తిగా ఫీమేల్ ఓరియంట్ సినిమాల వైపుగా మొగ్గుచూపుతున్నారు. యూటర్న్, ఓ బేబీ, యశోద, ఇప్పుడు శాకుంతలంతో ముందుకు రాబోతున్నారు.
ఈ సినిమా వచ్చే నెలలో 14న ధియేటర్లలో సందడి చేయనుంది. అయితే చిత్ర యూనిట్ ప్రమోషన్లను షురూ చేసింది.
ఇందులో భాగంగా ఈ సినిమా 3డి ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐమ్యాక్స్‌లో నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో దర్శకుడు గుణ శేఖర్‌తో పాటు దిల్ రాజు, గుణశేఖర్, నీలిమ గుణ, సాయిమాధవ్ బుర్రా, తదితరులు పాల్గొని మీడియాతో మాట్లాడారు.
శాకుంతం పాత్ర కోసం సమంతను ఎంపిక చేసుకోవడంపై గుణశేఖర్ మాట్లాడుతూ.. ఆ పాత్ర కోసం సమంత పుట్టారా అని సినిమా చూసినప్పుడు అనిపిస్తుందని అన్నారు.
ఈ సినిమాకు దిల్ రాజు సమర్పకుడిగా, నిర్మాతగా వ్యవహరిస్తుండగా ఆయనపై గుణ శేఖర్ ప్రశంసల వర్షం కురిపించారు. సినిమా కోసం ఆయన కష్టపడతారంటూ వ్యాఖ్యానించారు.
నార్త్‌లో కూడా ఈ సినిమాపై ఎక్కువ ఆసక్తితో ఉన్నారని, సమంత, దిల్ రాజుపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
చాలా మంది తెలియనివాళ్లు సమంత దిల్ రాజు కూతురా అనుకుంటున్నారు. ఎందుకంటే దిల్ రాజు అంత ఇన్వెస్ట్ చేసేశారని అన్నారు
ఎందుకంత ఇన్వెస్ట్ చేశారనే డౌట్ వాళ్లకు వచ్చిందని, అన్ని కోట్లు పెట్టి ఓ మైథాలజీ సినిమాను తీస్తారా అని భావిస్తున్నారన్నారు.
అలాగే గతంలో చేసిన కొన్ని సినిమాల గురించి ఎంత శ్రమించారో చెప్పారు.
అల్లు అర్జున్ తనయ అల్లు అర్హను కూడా మెచ్చకున్నారు. ఆమె తెలుగు మాత్రమే మాట్లాడుతుందని అన్నారు.
మన మాతృభాష తెలిసేలా అర్హ పెంచుతున్నందుకు అల్లు అర్జున్ ను సైతం పొగిడారు.