వేతనం అనేది ప్రతిభకు కట్టిన పట్టంగా భావిస్తుంటారు చాలా మంది. 

ఇది సాధారణ ఉద్యోగాల విషయంలో వాస్తవం కావొచ్చేమో కానీ, రాజకీయాల్లో దీనర్థం వేరు.

ప్రజాసేవ చేస్తామంటూ రాజకీయాల్లోకి వచ్చే నాయకుల వారి అవసరాలు మొత్తం ప్రజాధనం నుంచే ఖర్చు చేస్తారు. 

అయినప్పటికీ.. కొందరు ముఖ్యమంత్రులు భారీగా వేతనాలు పొందుతున్నారు. 

దేశంలోనే అధిక జీతం పొందుతున్న ముఖ్యమంత్రి ఎవరా.. అంటే..? మన తెలంగాణ ముఖ్యమంత్రే.

తెలంగాణ సీఎం అయిన కేసీఆర్ కు నెలకు రూ.4.10 లక్షల వేతనం లభిస్తోంది.

ఢీల్లీ సీఎం కేజ్రీవాల్, యూపీ సీఎం యోగి ఆతిథ్య నాథ్ తరువాత స్థానాల్లో ఉన్నారు.

రాష్ట్రాల వారిగా ముఖ్యమంత్రులు వేతనాలు

కె చంద్రశేఖర్ రావు (తెలంగాణ) - రూ.410,000

అరవింద్ కేజ్రీవాల్ (ఢిల్లీ) - రూ.390,000

యోగి ఆదిత్య నాథ్ (ఉత్తర ప్రదేశ్) - రూ.365,000

ఏకనాథ్ షిండే (మహారాష్ట్ర) - రూ.340,000

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (ఆంధ్రప్రదేశ్) - రూ.335,000

 భూపేంద్ర పటేల్ (గుజరాత్) - రూ.321,000

సుఖ్విందర్ సింగ్ సుఖు (హిమాచల్ ప్రదేశ్) - రూ.310,000

మనోహర్ లాల్ (హర్యానా) - రూ.288,000

హేమంత్ సోరెన్ (జార్ఖండ్) - రూ.272,000

శివరాజ్ సింగ్ చౌహాన్ (మధ్యప్రదేశ్) - రూ.255,000

భూపేష్ బఘేల్ (ఛత్తీస్‌గఢ్)- రూ.230,000

భగవంత్ సింగ్ మాన్ (పంజాబ్) - రూ.230,000

ప్రమోద్ సావంత్ (గోవా) - రూ.220,000

నితీష్ కుమార్ (బీహార్) - రూ.215,000

మమతా బెనర్జీ (పశ్చిమ బెంగాల్) - రూ.210,000

M. K. స్టాలిన్ (తమిళనాడు) - రూ.205,000

బసవరాజ్ బొమ్మై (కర్ణాటక) - రూ.200,000

ప్రేమ్ సింగ్ తమాంగ్ (సిక్కిం) - రూ.190,000

పినరయి విజయన్ (కేరళ) - రూ.185,000

అశోక్ గెహ్లాట్ (రాజస్థాన్) - రూ.175,000

పుష్కర్ సింగ్ ధామి (ఉత్తరాఖండ్) - రూ.175,000

నవీన్ పట్నాయక్ (ఒడిషా) - రూ.160,000

కాన్రాడ్ సంగ్మా (మేఘాలయ) - రూ.150,000

పెమా ఖండూ (అరుణాచల్ ప్రదేశ్) - రూ.133,000

హిమంత బిస్వా శర్మ (అస్సాం) - రూ.125,000

ఎన్. బీరెన్ సింగ్ (మణిపూర్) - రూ.120,000

నీఫియు రియో (నాగాలాండ్) - రూ.110,000

మాణిక్ సాహా (త్రిపుర) - రూ.105,500