కరేబియన్‌ క్రిషింగ్‌ మెషీన్‌ ఆండ్రీ రస్సెల్‌  విశ్వరూపం చూపించాడు. ఆన్‌క్యాప్డ్‌  బౌలర్‌పై ఉప్పెనలా విరుచుకుపడ్డాడు.

తన పవర్‌హిట్టింగ్‌ను రూచి చూపిస్తూ..  ఇన్నింగ్స్‌ చివరి ఐదు బంతుల్లో 6, 4, 6, 4, 4  బాది ఔరా అనిపించాడు. 

ఈ ఊరమాస్‌ ఇన్నింగ్స్‌ను రస్సెల్‌  ఇంగ్లండ్‌లో జరుగుతున్న ది హండ్రెడ్‌  లీగ్‌లో ఆడాడు.

గురువారం మాంచెస్టర్‌ ఒరిజినల్స్‌-సదరన్‌  బ్రేవ్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో రస్సెల్‌  రెచ్చిపోయాడు. 

కేవలం 23 బంతుల్లోనే 6 ఫోర్లు, 5 సిక్సులతో  64 పరుగులు చేసి అదరగొట్టాడు. 

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన  మాంచెస్టర్‌ ఒరిజినల్స్‌  నిర్ణీత 100 బంతుల్లో 3  వికెట్లు కోల్పోయి 188 పరుగుల భారీ స్కోర్‌  చేసింది. 

ఆ జట్టు కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌ 42 బంతుల్లో 3  ఫోర్లు, 5 సిక్సులతో 68, మరో ఓపెనర్‌ సాల్ట్‌ 22  బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్స్‌తో 38 పరుగులు  చేసి రాణించారు.

చివర్లో రస్సెల్‌ సునామీ ఇన్నింగ్స్‌తో  మాంచెస్టర్‌ భారీ స్కోర్‌ సాధించింది. 

హొగన్‌ వేసిన చివరి ఐదు బంతుల్లో రస్సెల్‌  వరుసగా 6, 4, 6, 4 , 4 బాది 24 పరుగులు  పిండుకున్నాడు.

ఇక భారీ లక్ష్యఛేదనకు దిగిన సదరన్‌ బ్రేవ్‌..  84 బంతుల్లో 120 పరుగులు మాత్రమే చేసి  ఆలౌట్‌ అయింది. 

బౌలింగ్‌లోనూ రస్సెల్‌ 5 బంతులేసి ఒక  వికెట్‌ పడగొట్టాడు. 

ఇలా ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో రస్సెల్‌  మాంచెస్టర్‌కు 68 పరుగుల తేడాతో భారీ  విజయం అందించాడు.