ప్రముఖ తమిళ హీరో శింబు పెళ్లి చేసుకోబోతున్నారని తమిళ సినిమా సర్కిల్‌లో చర్చ జరుగుతోంది.

శింబు ప్రస్తుతం ఓ ప్రముఖ వ్యాపారవేత్త కూతురితో డేటింగ్‌లో ఉన్నారంట.

శ్రీలంకకు చెందిన ఆ యువతి ప్రస్తుతం డాక్టర్‌ చదువుతోందట.

దానికి తోడు ఆమె శింబుకు పిచ్చ ఫ్యాన్‌ అట.

ఆమె తండ్రి శ్రీలంకలో పలు వ్యాపారాలు ఉన్నాయని సమాచారం.

రెండు కుటుంబాలకు చెందిన వారు వీరి పెళ్లికి సమ్మతం తెలిపారట. తర్వలో ఇద్దరూ ఏకం కాబోతున్నారట.

అయితే, ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియాలంటే శింబు కానీ, ఆయన కుటుంబసభ్యులు కానీ, స్పందించాల్సిందే.

ఇక, శింబు గతంలో నయనతార, హన్సికలతో ప్రేమ వ్యవహారం నడిపారు.

మనస్పర్థల కారణంగా ఇద్దరితో విడిపోయారు.