ఆస్కార్ అనేది అద్భుతమైన సినిమాలకు ప్రపంచంలోనే ఇచ్చే అత్యుత్తమ అవార్డు అని అంటుంటారు.

తాజాగా 'ఆర్ఆర్ఆర్' ఈ అవార్డు గెలుచుకోవడం వరల్డ్ వైడ్ పెద్ద చర్చనీయాంశంగా మారింది.

ఓ తెలుగు సినిమాలోని పాటకు ఈ అత్యుత్తమ పురస్కారం వరించడంతో యావత్ భారతదేశం గర్వపడింది.

ఇక 'ఆర్ఆర్ఆర్' ఆస్కార్ మేనియా నుంచి ఇంకా ప్రేక్షకులు బయటకు రాలేకపోతున్నారు.

తాజాగా మార్చి 25కి ఈ మూవీ విడుదలై సరిగ్గా ఏడాది గడిచిపోయింది. ఈ సమయంలో ఓ వీడియో వైరల్ అవుతోంది.

అయితే ఈ ఆస్కార్ రావడానికి రాజమౌళి కారణమని కొందరు, లేదు లేదు కీరవాణి కారణమని మరికొందరు వాదిస్తున్నారు.

ఇక ఫ్యాన్స్ అయితే తమ హీరో డ్యాన్స్ వల్లే వచ్చిందని మురిసిపోతున్నారు. అదే టైంలో కొరియోగ్రాఫర్ కష్టాన్ని గుర్తు చేసుకుంటున్నారు.

ఇదంతా ఇలా మాట్లాడుకుంటుండగానే.. ఇదే సినిమాలో చిన్న పాత్రలో నటించిన నటుడు అజయ్ దేవగణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

అసలు 'ఆర్ఆర్ఆర్'కు ఆస్కార్ రావడానికి తానే కారణమని చెప్పి అందరూ అవాక్కయ్యేలా చేశాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అయింది.

అసలేం జరిగిందంటే.. 'ఆర్ఆర్ఆర్'లో బాలీవుడ్ స్టార్స్ అయిన ఆలియాభట్, అజయ్ దేవగణ్ కూడా చిన్న పాత్రల్లో నటించారు.

ఆస్కార్ అవార్డుని 'ఆర్ఆర్ఆర్' గెలుచుకున్న తర్వాత వీళ్లు ఈ విషయం గురించి ఎక్కడా మాట్లాడలేదు.

అజయ్ దేవగణ్ హీరో కమ్ డైరెక్టర్ గా చేసిన మూవీ 'భోలా'. మార్చి 30న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ జరుగుతున్నాయి.

తాజాగా 'ద కపిల్ శర్మ' షోలో పాల్గొన్న అజయ్.. హోస్ట్ కపిల్ శర్మ ప్రశ్నకు ఆసక్తికర రీతిలో బదులిచ్చాడు.

RRR సినిమాకు ఆస్కార్ రావడానికి కారణం తనే అని, నాటు నాటు పాటలో డ్యాన్స్ చేయలేదు కాబట్టి అవార్డు వచ్చిందని చెప్పాడు.

దీంతో షోలో కూర్చున్న జడ్జిల దగ్గర నుంచి ఆడియెన్స్ వరకు అజయ్ దేవగణ్ ఫన్నీ ఆన్సర్ కు ప్రతి ఒక్కరూ నవ్వేశారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ వీడియోతో పాటు అజయ్ దేవగణ్ సెన్సాఫ్ హ్యుమర్ నెటిజన్స్ మధ్య చర్చకు కారణమైంది.