రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ కొనడం అనేది కుర్రాళ్ల కల అని కూడా చెప్పొచ్చు.
అయితే ధర ఎక్కువుగా ఉండటం వల్ల దానికి దూరంగా ఉంటున్నారు.
అలాంటి వారి కోసం కంపెనీ ఓ ప్రొడక్ట్ లాంఛ్ చేసింది. ఆ ప్రొడక్ట్ ఏంటో తెలిస్తే షాకవ్వాల్సిందే.
'రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 500' మోడల్ తరహాలో లాంచ్ చేసిన ఈ రెప్లికా బైక్ ధర అక్షరాలా రూ. 67,990 మాత్రమే.
రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రతి ఏటా రైడర్ మేనియా కమ్యూనిటీ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
అందులో భాగంగా కంపెనీ ఈసారి ఓ ప్రొడక్ట్ లాంఛ్ చేసింది.
అదే.. రాయల్ ఎన్‌ఫీల్డ్ 1:3 స్కేల్ మోడల్. దీని బరువు 8.5 కిలోలు కాగా, పొడవు 2.5 ఫీట్లు, వెడల్పు 1.25 ఫీట్లు, ఎత్తు 0.85 ఫీట్లు ఉంటుంది.
250 కంటే ఎక్కువ విడిభాగాలను కలిపి చేతితో తయారు చేయడం దీని ప్రత్యేకత.
దీని ధర రూ. 67,990 మాత్రమే. కాకుంటే ఇది నడపలేరు. ఇది రెప్లికా. షోపీస్‌లుగా పెట్టుకోవడానికి దీన్ని లాంచ్ చేశారు.
రాయల్ ఎన్‌ఫీల్డ్ లిమిటెడ్ ఎడిషన్ క్లాసిక్ ఎడిషన్ బరువులో ఇది 1:3 నిష్పత్తిలో ఉంటుంది. అందుకే దీన్ని రాయల్ ఎన్‌ఫీల్డ్ 1:3 స్కేల్ మోడల్ అని పిలుస్తున్నారు.
ఇది రాయల్ ఎన్‌ఫీల్డ్ లిమిటెడ్ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. రూ.2,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు.
టిల్ గ్రీన్, గన్ గ్రే, క్రోమ్ బ్లాక్, రెడ్ డిచ్, రెడ్ మెరూన్, క్రోమ్ బ్యాటిల్, గ్రీన్ డిసర్ట్, స్టార్మ్ జెట్ బ్లాక్.. ఇలా 18 రంగుల్లో లభిస్తోంది.