శృంగారం.. ఒకప్పుడు పెళ్ళైన దంపతులు మాత్రమే దీని గురుంచి చర్చించేవారు. 

అదే ఇప్పుడు వారు తప్ప మిగిలిన వారందరు దీని గురుంచి మాట్లాడుతున్నారు.

మరో జీవికి జన్మనిచ్చే శృంగారం గురుంచి మాట్లాడుకోవడం తప్పు కాదు. 

కావున నలుగురు ఏమనుకుంటుంటారో అన్న భయాలు వీడి దీని గురుంచి నిస్సందేహంగా మాట్లాడుకోవచ్చు.

అనుభవం ఉన్నా.. లేకపోయినా శృంగారం గురుంచి అందరికీ అన్ని విషయాలు తెలియవు. అందులో ఇదొకటి. శృంగారం రాత్రి కంటే ఉదయమే బాగుంటుందట.

తరచూ లైంగిక చర్యల్లో పాలుపంచుకునే వారికి నిద్ర కూడా బాగా పడుతుందట. 

ఇలాంటి వారు ఎలాంటి ఒత్తిళ్లకు లోనుకాకుండా ఉంటారట. చాలా సంతోషకరమైన జీవితాన్ని ఆశ్వాదిస్తారట.

ఇక వారంలో రెండుసార్లు లేదా అంతకంటే ఎక్కువ సార్లు సెక్స్ లో పాల్గొనే మగవారు గుండెపోటు బారిన పడే అవకాశం చాలా తక్కువని నిపుణులు చెప్తున్నారు.

ఇలా సుఖానికి సుఖం, ఆరోగ్యానికి ఆరోగ్యం అందించే శృంగారాన్ని కొంత మంది ఏవేవో కారణాల చెప్తూ దూరం పెడుతుంటారు.

అందులో ఆఫీసు పని ఒత్తిడి, లేట్ నైట్స్ పని వేళలు ఒక కారణమైతే.. ఎప్పుడు ఒకేరకంగా శృంగారాన్ని ఆస్వాదిస్తూ బోర్ కొడుతోందని ఫీల్ అయ్యేవారు మరికొందరు. 

మీరు కూడా ఇలాంటి సమస్యతో శృంగారానికి దూరమైతే కొద్దికొద్దిగా సరికొత్తగా ప్రయత్నించి చూడండి. అదే ఉదయం పూట శృంగార కార్యకలాపాల్లో నిమగ్నమవ్వండి అని..

ఉదయం పూట శృంగారం చేయడం వల్ల ఎన్నో బోలెడు ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

సాధారణంగా ఎవరైనా రాత్రి పూట కంటే ఉదయం పూట చాలా చురుగ్గా ఉంటారు. తనివితీరా నిద్రపోయి లేచాక శరీరం తనకు అవసరమయ్యే శక్తిని తిరిగి పొందుతుంది. 

అలా ఉదయం పూట మరింత ఎనర్జిటిక్ గా ఉన్నట్లు అనిపిస్తుంది. ఆ సమయంలో కొంత భాగాన్ని శృంగారానికి కేటాయించండి. 

ఇలా దంపతులిద్దరూ ఉత్సాహంగా ఉన్న సమయంలో శృంగారంలో పాల్గొంటే లూబ్రికేషన్ తో సమస్య ఉండవట. మంచి మజాను అందిస్తుందట.

మార్నింగ్ సెక్స్ చేయడం వల్ల ముందు రోజు ఒత్తిడి దూరమై రోజును ఉత్సాహంగా ప్రారంభించవచ్చని.. కొత్త అనుమభూతిలా ఉంటుందని చెప్తున్నారు.

అంతేకాదు.. ప్రారంభం మంచిదైతే సగం పని పూర్తయినట్లే అని పెద్దల అనే మాట మార్నింగ్ సెక్స్‌కు సరిగ్గా సరిపోతుందని చెప్తున్నారు.