హిట్ మ్యాన్  రోహిత్ శర్మ నెలకొల్పిన ప్రపంచ రికార్డుకు 7 ఏళ్లు పూర్తి అయింది. క్రికెట్ చరిత్రలో కనీవిని ఎరుగని విధంగా విధ్వంసం సృష్టిస్తూ ఏకంగా 264 పరుగులు బాదేశాడు.

వన్డేల్లో ఇదో ఎవరెస్ట్ లాంటి రికార్డ్. ఇంత వరకు దీని దరిదాపుల వరకు కూడా ఎవరు చేరలేదు.

2014 నవంబర్ 13న కోల్కత్తాలోని ఈడెన్ గార్డెన్స్లో శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్లో రోహిత్ శర్మ 173 బంతుల్లో 33 ఫోర్లు, 9 సిక్సర్లతో 264 పరుగులు చేశాడు. 

అనంతరం కులశేఖర్ వేసిన 49.5 ఓవర్లో మహేళ జయవర్ధనేకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

ఈ వన్డేలో భారత్ ఏకంగా 404 పరుగులు చేసింది. కాగా సెంచరీ చేసేందుకు 100 బాల్స్ ఆడిన రోహిత్ ఆ తర్వాత టాప్గేర్లోకి వచ్చేశాడు.

కేవలం 25 బంతుల్లో 50 పరుగులు చేసి.. 150 పరుగులు పూర్తి చేశాడు.

మరో 26 బంతుల్లో 51, అనంతరం 15 బంతుల్లోనే 49 పరుగలు చేసి 250 మార్క్ను అందుకున్నాడు.

సెంచరీ  తర్వాత విధ్వంస సృష్టించాడు. 164 పరుగులను కేవలం 73 బంతుల్లో కొట్టేశాడు.

ఇక ఈ మ్యాచ్ తర్వాత రోహిత్ శర్మ వెనక్కి తిరిగి చూడలేదు. టన్నుల కొద్ది పరుగులు చేస్తూ టీమిండియా హిట్మ్యాన్గా తన ప్రస్థానం కొనసాగిస్తున్నాడు.

ఇప్పటి వరకు 227 వన్డేలు ఆడిన రోహిత్.. 220 ఇన్నింగ్స్లలో 88.90 స్ట్రైక్రేట్ 48.96 సగటుతో 9205 పరుగులు చేశాడు.

అందులో 29 సెంచరీలు, 43 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే టెస్టులోనూ అదరగొడుతున్న రోహిత్.. 

43 మ్యాచ్లు ఆడి 74 ఇన్నింగ్స్లలో 55.47 స్ట్రైక్రేట్ 46.87 సగటుతో 3047 పరుగులు చేశాడు.

 టెస్టుల్లో 8 సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలు సాధించాడు. ఇక 116 టీ20 మ్యాచ్లు ఆడి 108 ఇన్నింగ్స్లలో 139.61 స్ట్రైక్రేట్ 32.66 సగటుతో 3038 పరుగులు చేశాడు. 

టీ20ల్లో రోహిత్కు 4 సెంచరీలు, 24 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 

 మరి రోహిత్ శర్మ ఫామ్, 264 రికార్డుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.