టీమిండియాని ఓ రేంజ్ కి తీసుకెళ్లిన క్రికెటర్లలో మిగతా దిగ్గజ క్రికెటర్లతో పాటు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కచ్చితంగా ఉంటారు.
2007 టీ20 ప్రపంచకప్ విజయంలో రోహిత్, 2011 ప్రపంచకప్ గెలుచుకోవడంలో కోహ్లీ, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ దక్కించుకోవడంలో కోహ్లీ-రోహిత్ కీలక పాత్ర పోషించారు.
అయితే 2021 టీ20 వరల్డ్ కప్ తర్వాత కోహ్లీని టీ20 కెప్టెన్సీ నుంచి తప్పించారు. ఆ బాధ్యతల్ని రోహిత్ శర్మకు అప్పగించారు.
ఆ తర్వాత కొన్నాళ్లకు వన్డే, టెస్టు కెప్టెన్ గానూ రోహిత్ బాధ్యతలు అందుకున్నాడు. దీంతో క్రికెట్ అభిమానులు చాలా ఎక్స్ పెక్ట్ చేశారు.
ఇక కెప్టెన్ అయితే మారాడు గానీ రిజల్ట్ అయితే పెద్దగా మారలేదు. గతేడాది టీమిండియాలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి.
ఈ క్రమంలోనే గతేడాది ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ లోనూ భారత్ సెమీస్ వరకే వెళ్లగలిగింది.
ఫలితంగా రోహిత్ కెప్టెన్సీపైనా అందరూ విమర్శలు చేశారు. దీంతో న్యూజిలాండ్, ఐర్లాండ్ తో టీ0 సిరీస్ లకు హార్దిక్ ని టెంపరరీ కెప్టెన్ ని చేశారు.
ఇక తాజాగా జరుగుతున్న శ్రీలంకతో టీ20 సిరీస్ కోసం హార్దిక్ కే మళ్లీ కెప్టెన్సీ కట్టబెట్టారు. అతడు మెల్లగా కుదురుకుంటున్నాడు.
ఇకపోతే రెస్ట్ పేరు చెప్పిన.. లంకతో టీ20 సిరీస్ కోసం కోహ్లీ, రోహిత్ ని తప్పించారు.
అయితే టీ20ల నుంచి వాళ్లని పూర్తిగా తప్పించే ప్లాన్ లో ఇది తొలి స్టెప్ అని తెలుస్తోంది.
తాజాగా రెండో టీ20లో మన జట్టు ఓటమి తర్వాత కోచ్ ద్రవిడ్ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది.
2024 టీ20 వరల్డ్ కప్ కోసం జట్టుని తయారు చేస్తున్నామని, కుర్రాళ్లు కాస్త కుదురుకునే వరకు ఓపిక పట్టాలని ద్రవిడ్ చెప్పాడు. దీన్నిబట్టి కోహ్లీ, రోహిత్ ఇక టీ20ల్లో కనిపించడం కష్టమే!
ఇక జనవరి చివర్లో స్వదేశంలో భారత్, న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ ఆడనుంది.
ఇందులోనూ కోహ్లీ, రోహిత్ ఆడరని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు.
ఇలా ఏ యాంగిల్ లో చూసుకున్నా సరే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ శకం టీమిండియా టీ20 జట్టులో ముగిసినట్లే కనిపిస్తుంది.