టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అరుదైన రికార్డును సాధించాడు.

బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న 4వ టెస్టులో ఈ ఘనతను అందుకున్నాడు.

అహ్మాదాబాద్‌ వేదికగా జరుగుతున్న టెస్టులో ఆస్ట్రేలియాను భారత బౌలర్లు 480 రన్స్‌కు ఆలౌట్‌ చేశారు.

తొలి ఇన్నింగ్స్‌ ఆరంభించిన భారత ఓపెనర్లు వికెట్‌ కోల్పోకుండా రెండో రోజు ఆటను ముగించారు.

మూడో రోజు ఉదయం తొలి వికెట్‌కు 74 రన్స్‌ జోడించిన తర్వాత రోహిత్‌ అవుట్‌ అయ్యాడు.

కుహ్నేమన్‌ బౌలింగ్‌లో లబుషేన్‌కు సింపుల్‌ క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు.

58 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్స్‌తో 35 పరుగులు చేశాడు రోహిత్‌ శర్మ.

అద్భుతమైన సిక్స్‌తో మంచి టచ్‌లో కనిపించిన రోహిత్‌.. అనవసరపు డౌట్‌ఫుల్‌ షాట్‌తో వికెట్‌ సమర్పించుకున్నాడు.

దీంతో 74 పరుగుల వద్ద భారత్‌ తొలి వికెట్‌ను కోల్పోయింది.

అయితే ఈ 35 పరుగుల ఇన్నింగ్స్‌తో రోహిత్‌ రెండు అరుదైన మైల్‌స్టోన్స్‌ను చేరుకున్నాడు.

21 రన్స్‌ వద్ద అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లు కలుపుకుని రోహిత్‌ 17 వేల రన్స్‌ పూర్తి చేసుకున్నాడు.

భారత తరఫున 17 వేల రన్స్‌ పూర్తి చేసుకున్న 6వ బ్యాటర్‌గా రోహిత్‌ నిలిచాడు.

అలాగే స్వదేశంలో టెస్టుల్లో అత్యంత వేగంగా 2 వేల రన్స్‌ పూర్తి చేసుకున్న రెండో బ్యాటర్‌గా రోహిత్‌ రికార్డు సృష్టించాడు.