మనలో చాలా మందికి  రా రైస్ వాటర్ ప్రయోజనాలు తెలియక వాటిని పారబోస్తూ ఉంటాము.

రా రైస్ వాటర్ ప్రయోజనాలు సరిగ్గా తెలిస్తే మాత్రం వాటిని వృధా చేయము

మీ చర్మాన్ని మెరిసేలా చేయడానికి రా రైస్ వాటర్ చాలా పని చేస్తుంది. 

రైస్ వాటర్‌లో ప్రొటీన్లు, విటమిన్లు, కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్లు, వివిధ రకాల పోషకాలు ఉంటాయి. .

రైస్ వాటర్‌ చర్మానికి పోషణ అందించడంతో పాటు మొటిమలు వంటి సమస్యలను దూరం చేస్తుంది. 

అరకప్పు రైస్ వాటర్ లో రెండు టీస్పూన్ల అలోవెరా జెల్ కలిపి ప్యాక్ లాగా అప్లై చేయాలి.

సుమారు 15 నిమిషాలు ఉంచి ఆపై సాధారణ నీటితో శుభ్రం చేసుకోండి. ఇది మొటిమలను కూడా పోగొట్టి చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.

 అరకప్పు రైస్ వాటర్‌లో ఒక టీస్పూన్ పసుపు పొడిని కలపడం వల్ల ముఖ చర్మం కాంతివంతంగా మారుతుంది 

బియ్యం నీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. 

మొటిమలను తొలగించి, చర్మానికి మెరుపు తెచ్చేలా పనిచేస్తుంది.

బియ్యం నీళ్లలో అర చెక్క నిమ్మకాయ రసాన్ని కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి.

దాదాపు 15 నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఇలా చేస్తే  టానింగ్ ,సన్ బర్న్ వంటి సమస్యల నుండి బయటపడవచ్చు

చూశారు కదా.. ఇవి రా రైస్ వాటర్ ప్రయోజనాలు!