ఆడ, మగ బంధంలోకి అడుగుపెట్టిన తర్వాత ఒకరినుంచి ఒకరు ఏదో ఒకటి ఆశించటం పరిపాటి.
ముఖ్యంగా ఎదుటి వ్యక్తి తమకే సొంతం అన్న ఫీలింగ్ కూడా ఉంటుంది.
కానీ, కొంతమంది మగాళ్లలో పొససివ్‌నెస్ ఉంటుంది.
అలాంటి మగాళ్లు తమ భాగస్వామికి సంబంధించిన ప్రతీ విషయాన్ని తమ కంట్రోల్‌లో ఉంచుకోవటానికి ప్రయత్నిస్తుంటారు.
ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎలా బట్టలు వేసుకోవాలో కూడా డిసైడ్ చేస్తుంటారు.
పొససివ్‌నెస్ ఉన్న మగాళ్లు తమ భాగస్వామిని అస్సలు నమ్మరు.
ఎప్పుడూ అనుమానిస్తూ ఉంటారు.
అనుమానం కారణంగా భాగస్వామికి ఇష్టం వచ్చినట్లు ఆంక్షలు పెడుతూ ఉంటారు.
ఎదుటి వ్యక్తి నిర్ణయాలకు ఎలాంటి గౌరవం ఇవ్వరు.
పైగా వాటిని ప్రభావితం చేస్తూ ఉంటారు.
వీరికి తమ లోకం అంటూ ఏమీ ఉండదు. భాగస్వామి చుట్టూ తిరుగుతూ ఉంటారు.
తమ ఆడవారు వేరే మగాళ్లతో మాట్లాడితే తట్టుకోలేరు. అనసరమైన ఊహలకు తావిస్తూ ఉంటారు.
భాగస్వాములు వారి అభిప్రాయాలను వ్యతిరేకిస్తే అస్సలు తట్టుకోలేరు.