రెడ్మీ కంపెనీ నుంచి కొత్త ఫీచర్స్ తో మరో స్మార్ట్ మార్కెట్ లోకి అడుగు పెట్టింది.

మార్కెట్లో ఇప్పటికే ఉన్న రియల్మీ 8 5జీ, పోకో ఎం3 ప్రో 5జీ, ఒప్పో ఏ53ఎస్ 5జీ, రియల్మీ నార్జో 30 ప్రో 5జీ అందుబాటులో ఉన్నాయి.

తాజాగా రెడ్మీ నుంచి నోట్ 11టీ 5జీ స్మార్ట్ ఫోన్ అందరికి అందుబాటులోకి వచ్చింది. 

ఈ మొబైల్ మిగతా స్మార్ట్ ఫోన్ లతో ఈ రెడ్మీ నోట్ 11టీ 5జీ స్మార్ట్ ఫోన్ పోటీ పడుతుందని కంపెనీ ఆశ భావం వ్యక్తం చేసింది. 

అయితే నూతనంగా విడుదల చేసిన ఈ స్మార్ట్ ఫోన్ ప్రత్యేకతలు ఏంటీ? పీచర్స్ ఎలా ఉన్నాయనేది ఇప్పుడు తెలుసుకుందాం. 

ఈ రెడ్మీ నోట్ 11టీ 5జీ స్మార్ట్ కి మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్

5,000ఎంఏహెచ్ బ్యాటరీ, 50మెగాపిక్సెల్ డ్యూయెల్ కెమెరా సెటప్ వంటి ఎన్నో ప్రత్యేకతలున్నాయి.

ఇక రెడ్మీ నోట్ 11టీ 5జీ ప్రారంభ ధర రూ.16,999. ఇది 6జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర.

ఇక 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.17,999 కాగా, హైఎండ్ వేరియంట్ 8జీబీ ర్యామ్ + 128జీబీ. రూ.19,999. 

రెడ్మీ నోట్ 11టీ 5జీ స్మార్ట్ఫోన్ 6జీబీ+64జీబీ వేరియంట్ను రూ.14,999 ధరకు దక్కించుకోవచ్చు.

6జీబీ+128జీబీ వేరియంట్ను రూ.15,999 ధరకు, 8జీబీ+128జీబీ వేరియంట్ను రూ.16,999 ధరకు సొంతం చేసుకోవచ్చు.

ఈ మొబైల్ ను ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా కొనుకోగులు చేస్తే రూ.1000 వరకు తగ్గింపు ఉంటుంది. 

అయితే డిసెంబర్ 7న అమెజాన్లో సేల్ ప్రారంభం కానుండం విశేషం. 

ఇక దీంతో పాటు ఈ మొబైల్ లు కొనుగోలు చేసేవారికి మరిన్ని ఆఫర్లు వర్తిస్తాయని తెలిపింది.