దీనికి కొనసాగింపుగా వచ్చిన నోట్ 11 సిరీస్‌లో ఇప్పటికే రెడ్మీ నోట్ 11టీ 5జీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ కాగా, రెడ్మీ నోట్ 11, రెడ్మీ నోట్ 11ఎస్ మోడల్స్‌ను కొత్తగా లాంచ్ చేసింది.
రెడ్మీ నోట్ 11 సిరీస్ ను ప్రపంచవ్యాప్తంగా నాలుగు మోడల్స్ లో తీసుకురాగా, ఇండియాలో మాత్రం రెండు మోడల్స్ మాత్రమే లాంచ్ చేసింది.
రెడ్మీ నోట్ 11 ఫోన్ 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.13,499 ఉండగా, 6జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,499.
ఈ ఫోన్ హారిజన్ బ్లూ, స్పేస్ బ్లాక్, స్టార్ బర్స్ట్ వైట్ కలర్ ఆప్షన్లలో లభ్యం కానుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డుతో కొనుగోలు చేస్తే రూ.1,000 తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది.
రెడ్మీ నోట్ 11 ఎస్ ఫోన్ 6జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజీ మోడల్ ధర రూ.16,499, 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.17,499గా ఉంది.
అలాగే 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజీ టాప్ మోడల్ ధర రూ.18,499గా ఉంది.
ప్రముఖ ఈకామర్స్ సంస్థ అమెజాన్ కంపెనీ వెబ్సైట్ ద్వారా ఫిబ్రవరి 11 నుంచి నోట్ 11, ఫిబ్రవరి 21న నోట్ 11 ఎస్ మోడల్స్ అమ్మకాలు మొదలుకానున్నాయి.