మనం తినే ఆహారమే మన ఒంటికి శక్తిని ఇస్తుంది. మనం ఆరోగ్యంగా ఉండేలా చూస్తుంది.
మన పని చేసుకోవడానికి ఫుడ్ చాలా అసవరం. మనం బతకాలంటే పుష్కలంగా తినాల్సిందే. కానీ కొంతమందికి అస్సలు ఆకలి ఉండదు.
దీనివల్ల వారు చాలా నీరసంగా కనిపిస్తారు. ఎప్పుడూ ఆకలి వేయకపోవడానికి కొన్ని సమస్యలే కారణమని నిపుణులు అంటున్నారు.
మనం ఒత్తిడిలో ఉంటే కేంద్ర నాడీవ్యవస్థ జీర్ణక్రియను మందగించే హార్మోన్లను విడుదల చేస్తుంది. దీంతో మనకు ఆకలి బాగా తగ్గుతుంది.
దీర్ఘకాలిక ఆందోళన, ఒత్తిడి, నిరాశతో ఉన్నవారికిక దీర్ఘకాలికంగా ఆకలి వేయదు. ఈ సమస్యలు తినాలనే కోరికను తగ్గిస్తాయి.
ఆకలిని కూడా ప్రభావితం చేసే రోగాలలో జలుబు, ఫ్లూ, దగ్గు లేదా వైరల్ ఇన్ఫెక్షన్ ఉన్నాయి. బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, సైనస్.. వాసన, రుచికి ఆటంకం కలిగిస్తాయి. ఆకలిని తగ్గిస్తాయి.
ఆర్థరైటిస్ లేదా ఫైబ్రోమైయాల్జియా కారణంగా కండరాల నొప్పి దీర్ఘకాలం పాటు ఉంటుంది. ఇది శారీరక, మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఆకలిని తగ్గిస్తుంది.
ఆకలి తగ్గడానికి దారితీసే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు.. ప్రకోప ప్రేగు సిండ్రోమ్, హైపోథైరాయిడిజం, పోషక లోపాలు (జింక్ లోపం), హెపటైటిస్, హెచ్ఐవి, మూత్రపిండాలు, కాలేయ వ్యాధి, కొన్ని రకాల క్యాన్సర్లు.
యాంటీ బయాటిక్స్, యాంటీ హైపర్టెన్సివ్స్, మూత్రవిసర్జన ఉపశమనం లాంటి మందులు రేడియోథెరపీ, కెమోథెరపీ, పెరిటోనియల్ డయాలసిస్ వంటి చికిత్సల మాదిరిగానే ఆకలిని తగ్గిస్తాయి.
వయస్సు కూడా ఆకలిని తగ్గిస్తుంది. ఎందుకంటే ఏజ్ పెరిగేకొద్దీ జీవక్రియ, హార్మోన్ల పనితీరు తగ్గుతుంది. వయసు పెరిగేకొద్ది ఫుడ్ నమలే సామర్థ్యం కూడా తగ్గిపోతుంది.
ప్రెగ్నెన్సీ టైంలో మహిళల బాడీలో హార్మోన్లలో చాలా మార్పులకు జరుగుతాయి. ఇది ఆకలి తగ్గడానికి దారితీస్తుంది.
గర్భధారణ సమయంలో హృదయ వికారం, గుండెల్లో మంట, వాంతులు మొదలైన సమస్యలు ఉంటాయి. వీటివల్ల కూడా ఆకలి వేయదు.
ఒంటరిగా ఉంటే తినాలనిపించదు. తిన్నా కొద్దిగానే తింటారు. అందుకే ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేయండి.
ఎక్కువ మందిలో ఉండి, భోజనం చేస్తే రుచికరమైన ఫుడ్ తినాలనే కోరిక పెరుగుతుంది.
తక్కువగా తినేవారు అవకాడో సలాడ్ లేదా స్మూతీ, చిలగడదుంప చాట్, కాయలు, విత్తనాల మిశ్రమం వంటి కేలరీలు, పోషకాలు పుష్కలంగా ఉండే ఆహారాన్నే తినండి.
మీ రోజువారీ పోషక అవసరాలను తీర్చడానికి ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉండే ఆహారాలను తినండి.
మీరు ఒకేసారి ఇంతంతా తినాలనేం లేదు. రోజుకు నాలుగైదు సార్లైనా తినండి. అది కూడా కొద్ది కొద్దిగా. దీనివల్ల మీ శరీరానికి పోషకాలు అందుతాయి. బరువు కరెక్ట్ గా ఉంటుంది.
ఒత్తిడి, నిరాశ, ఆందోళన ఉన్నవారు తినడానికి అలారం సెట్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే వీళ్లు ఒత్తిడిలో ఉంటే తినడం మర్చిపోయే ఛాన్సుంది.
రోజూ 7 నుంచి 9 గంటలపాటు నిద్రపోయేలా ప్లాన్ చేసుకోండి. తక్కువ నిద్రపోయేవారు ఎక్కువ లేదా తక్కువ ఆకలి కలిగి ఉంటారని అధ్యయనాలు చెబుతున్నాయి.
నోట్: పైన టిప్స్ పాటించేముందు మీ దగ్గర్లోని డాక్టర్, నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం.