టీ20 వరల్డ్ కప్ 2021 లో భాగంగా టీమిండియాపై పాకిస్తాన్ ఘన విజయం సాధించింది.

పాకిస్తాన్ పై టీమిండియా ఓటమికి అనేక కారణాలు ఉన్నాయనే చెప్పాలి.

 పాకిస్తాన్ తో ఇండియా తలపడిన గత మ్యాచ్ లో గెలవటంతో పాకిస్తాన్ నే కదా అనే ఓ చిన్నచూపు ఉండటం.

ఓపెనర్లుగా బ్యాటింగ్ కు దిగిన కెప్టెన్ కోహ్లీ మినహా రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ పెద్దగా ఆకట్టుకోలేక పోవటం.

షాహీన్ అఫ్రీది బౌలింగ్ లో వేసిన నో బాల్  కేఎల్ రాహుల్ అవుట్ అంటూ అంపైర్లు నిర్ణయం తీసుకున్నారని నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు ఇది కూడా పెద్ద మైనస్ గానే చెప్పొచ్చు.

పాకిస్తాన్ బౌలర్లు తమ అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకోవటం ప్లస్ పాయింట్ గా చెప్పవచ్చు.

రిషబ్ పంత్ మెల్ల మెల్లగా కుదురుకుని రాణిస్తున్న క్రమంలోనే అవుట్ కావటం మైనస్ గా మారిందనే చెప్పాలి.

మిడిల్ ఆర్డర్లు సూర్య కుమార్ యాదవ్, జడేజా, హర్థిక్ పాండ్యా ఇతర ఆటగాళ్లు పెద్దగా ఆకట్టుకోలేక పోవటం అతి పెద్ద మైనస్ గా మారింది.

మరీ ముఖ్యంగా శార్దూల్ స్థానంలో ఫామ్లో లేని భువనేశ్వర్ను తీసుకోవడం కూడా మరో పొరపాటుగా చెప్పవచ్చు.

 అశ్విన్ స్థానంలో మిస్టరీ స్పిన్నర్గా వరుణ్ చక్రవర్తి బరిలోకి దిగి నాలుగు ఓవర్లు వేసి ఏకంగా 33 పరుగులు ఇవ్వటం పాకిస్తాన్ కు కలిసొచ్చిన అంశం.

ఓ రకంగా మెంటర్ గా అడుగు పెట్టిన ధోనీ, కోహ్లీ నిర్ణయాలు కూడా కాస్త కలిసి రాకపోవటం అనేవి టీమిండియా ఓటిమికి కారణాలుగా చెప్పవచ్చు.