రిలేషన్ షిప్ బలంగా ఉండాలంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడంతో పాటు సపోర్ట్ గా ఉండాలి. 

ఇది లేకపోతే గనుక వారి రిలేషన్ షిప్ తొందరగా విడిపోయే ప్రమాదం ఉందని నిపుణులు తెలియజేస్తున్నారు.

నిజానికి రిలేషన్ షిప్ లో ఉన్నవాళ్లు విడిపోవడానికి అసలు కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

రిలేషన్ షిప్ లో ఉన్నవాళ్లు కొట్టుకోవడం, తిట్టుకోవడం అనేది సర్వసాధారణమే. కానీ కొందరు ప్రతీ చిన్న విషయానికి పెద్ద గొడవలు చేస్తుంటారు.

ఒకరి భావాలు ఒకరు అర్థం చేసుకోనప్పుడే రిలేషన్ షిప్ లో నమ్మకం పోతుందని, తద్వారా విడిపోవడానికి ఆస్కారం ఉంటుందని సైకలాజిస్టులు అభిప్రాయపడుతున్నారు.

ముఖ్యంగా మీ భాగస్వామి ఏదైన విజయం సాధిస్తే మెచ్చుకోకపోయిన పర్వాలేదు కానీ.., అసూయ మాత్రం చెందకూడదట.

ఇలా చేస్తే మీ భాగస్వామికి మిమ్మల్ని వద్దనుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట.

మీ భాగస్వామి మీరు చెప్పినట్టే నడుచుకోవాలి, మీ చెప్పు చేతుల్లోనే ఉండాలి అనుకోవడం ముర్ఖత్వం మరొకటి ఉండదు. ఇలా ప్రవర్తిస్తే మీ బంధానికి భంగం కలిగించినవారవుతారు.

రిలేషన్ షిప్ లో ఉన్నవాళ్లు సరదాగా చిన్న చిన్న అబద్దాలు చెప్పడం మాములే. కానీ అదే పనిగా అబద్దాలు చెప్పి నమ్మక ద్రోహం చేయడం మాత్రం మానుకోవాలి. 

అలా మానుకోకపోతే మాత్రం మొదటికే మోసం వస్తుంది.

రిలేషన్ షిప్ లో ఉన్న చాలా మంది వాళ్లకున్న అర్థిక అంశాలు తమ భాగస్వామితో పంచుకోరు. ఇదే కాకుండా ఎంతో ఆస్తులు, అంతస్తులు ఉన్నాయని గొప్పలు చెబుతుంటారు. 

నిజానికి ఇలాంటి విషయాలను సైతం మీ భాగస్వామికి చెప్పకపోవడం కూడా పొరపాటు కిందకు వస్తుంది.

మీ భాగస్వామిని ఒత్తిడికి కలిగించే పనులు అస్సలు చేయకూడదు. అలా చేస్తే గనుక మీ పట్ల ఉన్న నమ్మకం పూర్తిగా కోల్పోయిన వారు అవుతారు.

రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు ఒకరి అవసరాలు మారొకరు పట్టించుకోవాలి. అలా పట్టించుకోకపోతే మీరు విడిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది.

మీ భాగస్వామి ఏదైన తప్పు చేసినప్పుడు అప్పుడప్పుడు క్షమిస్తుంటారు. చేసిన తప్పులే మళ్లీ మళ్లీ చేస్తుంటే మారుతాడు లే అనుకుంటే మాత్రం మీరు చేసే అతి పెద్ద తప్పు అయి మీ రిలేషన్ షిప్ కు ఎండ్ కార్డు పడే ప్రమాదముంటుందని మానసిక నిపుణులు సూచిస్తున్నారు.