టాలీవుడ్లో ఎన్టీఆర్.. ఏఎన్నార్ ఫ్యామిలీలకు ఎంత పేరుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
దాదాపు 40 ఏళ్లకుపైగా ఎన్టీఆర్, ఏఎన్ఆర్ల మధ్య అనుబంధం కొనసాగింది. ఇద్దరూ అన్నాతమ్ముడిలా మెగిలే వారు.
సినిమా పరంగా ఎంత పోటీ ఉన్నా.. ఇద్దరూ కలిసి మల్టీస్టారర్ సినిమాలు చేసేవారు.
ఇలా ఇద్దరూ దాదాపు 15 సినిమాల్లో కలిసి నటించారు.
అయితే, రాజకీయ ఎంట్రీ విషయంలో ఇద్దరి మధ్యా గ్యాప్ వచ్చింది.
ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వెళుతూ ఏఎన్ఆర్ను కూడా తనతో పాటు రమ్మని అడిగారు.
తనకు రాజకీయాలు వద్దని ఏఎన్ఆర్ అన్నారు. ఎన్టీఆర్ రెండు, మూడు సార్లు అడిగితే కాదని చెప్పారు.
ఈ నేపథ్యంలోనే ఇద్దరి మధ్యా ఓ చిన్న గ్యాప్ వచ్చింది.
తర్వాతి కాలంలో అన్నాపూర్ణ స్టూడియో విషయంలో ఇద్దరి మధ్యా గ్యాప్ బాగా పెరిగింది.
ఏఎన్ఆర్, ఎన్టీఆర్ను బాగా అవాయిడ్ చేస్తూ వచ్చారు. అయితే, ఎన్టీఆర్.. లక్ష్మీ పార్వతిని పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరూ కలిసిపోయారు.
ఈ విషయాలను ఏఎన్ఆర్ ఓ ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పుకొచ్చారు.
అప్పటినుంచి రెండు కుటుంబాలు సఖ్యతగా ఉంటూ వస్తున్నాయి.
వీరసింహారెడ్డి సినిమా సక్సెస్ మీట్లో బాలయ్య చేసిన వ్యాఖ్యలతో మళ్లీ రెండు కుటుంబాల మధ్య గ్యాప్ వచ్చిందన్న చర్చ జరుగుతోంది.