బ్యాంక్ ఖాతాదారులకు భారతీయ సెంట్రల్ బ్యాంక్ 'రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)' శుభవార్త చెప్పింది.
బ్యాంక్ ఖాతాల్లో జీరో బ్యాలెన్స్ ఉన్నా ఎలాంటి ఫైన్ విధించకూడదని ఆర్బీఐ బ్యాంకులు సూచించింది. ఇది ఖాతాదారులకు ఊరటనిచ్చే విషయమే.
అకౌంట్లలో తగినంత బ్యాలెన్స్ లేకుంటే బ్యాంకులు ఫైన్ విధిస్తాయన్న విషయం అందరికీ విదితమే.
'మినిమం బ్యాలెన్స్' పేరు చెప్పి బ్యాంకులు ఖాతాదారుల డబ్బును దోచేస్తున్నాయి.
ఖాతాల్లో అత్యవసరాలకై ఉంచిన డబ్బును కూడా 'మినిమం బ్యాలన్స్' చార్జీల పేరిట బ్యాంకు యాజమాన్యాలు కట్ చేస్తున్నాయి.
మరికొన్ని సందర్భాల్లో ఇతర అవసరాల కోసం డబ్బులు వేసినా.. అందులో నుంచి ఛార్జీలు కట్ చేస్తున్నారు.
ఈ సమస్యలపై ఖాతాదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఆర్‌బీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
సేవింగ్స్ ఖాతాల్లో బ్యాలెన్స్ లేకపోయినా.. మినిమం బ్యాలెన్స్ మెయింటెనెన్స్ కింద ప్రస్తుతం విధిస్తున్న చార్జీలను నిలిపివేయాలని ఆర్‌బీఐ.. బ్యాంకులను కోరినట్లు తెలుస్తోంది.
కొన్ని బ్యాంకులు ఇప్పటికే ఆ దిశగా చర్యలు చేపట్టినట్లు సమాచారం.
ప్రముఖ ప్రవేట్ బ్యాంక్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ మినిమం బ్యాలెన్స్ మెయింటెన్స్ చేయకపోయినా ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయబోమని ప్రకటించినట్లు వార్తలొస్తున్నాయి.
మరో దిగ్గజ ప్రైవేట్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ కూడా అదే దారిలో వెళ్తున్నట్లు తెలుస్తోంది. మరికొన్ని ప్రభుత్వ బ్యాంకులు సైతం ఇదే ఆలోచనలో ఉన్నాయని సమాచారం.
ఏదేమైనా ఆర్‌బీఐ తీసుకున్న ఈ నిర్ణయం సామాన్యులకు ఊరటనిచ్చేదే.