కరెన్సీ నోట్ల విషయంలో ఆర్బీఐ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నోట్లకు ఫిట్‌నెస్‌ టెస్టు పెట్టనుంది. ఆ టెస్టులో పాస్‌ అయిన నోట్లను మాత్రమే బ్యాంకులు స్వీకరిస్తాయి.

ఆ టెస్టు నకిలీనోట్లను గుర్తించేందుకు అయి ఉంటుందని పప్పుకాలేయకంటి.. పాత, చిరిగిన నోట్లను గుర్తించడానికి మాత్రమే.

ఇక బ్యాంకుల్లో నోట్లను లెక్కించడానికి బదులు నోట్ల ఫిట్‌నెస్‌ను తనిఖీ చేయడానికి యంత్రాలను ఉపయోగించాలని దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులను ఆర్బీఐ ఆదేశించింది.

ఆర్భీఐ సూచనల ప్రకారం ఇప్పుడు ప్రతి మూడు నెలలకు నోట్ల ఫిట్‌నెస్ తనిఖీ చేస్తారు. ఈ పరిస్థితిలో మీ జేబులో ఉన్న నోటు నలిగిపోయి ఉంటే ఇక దాన్ని తీసుకెళ్లి చెత్తకుప్పలో పడేయాల్సిందే.

అది పది రూపాయాల నోటైనా, రెండు వేల రుపాయాల నోటైనా సరే. నోటు రంగు పోయినయినా.. చిరిగిన నోటుపై ఏదైనా రకమైన టేప్ అతికించి ఉన్నా వాటిని అన్‌ఫిట్‌ నోట్లుగా గుర్తిస్తారు

ఈ నిర్ణయంతో ఆర్బీఐకి నోట్ల రీసైక్లింగ్‌ సులభం అవుతుంది.

నోటు భౌతిక స్థితిని బట్టి రీసైక్లింగ్‌కు పనికొస్తాయా? లేదా అనే గుర్తించి.. కరెన్సీ నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దశలవారీగా తొలగించి వాటి స్థానంలో కొత్త నోట్లను తయారు చేస్తుంది.

ఇలాంటి నోట్లని గుర్తించడానికి కొత్తగా మెషీన్లని తయారుచేస్తోంది. రీసైక్లింగ్‌కు అనువుగా ఉన్న నోట్లను మాత్రమే వినియోగించాలని బ్యాంకులకు తెలిపింది.

లేదంటే రీ సైక్లింగ్‌ చేయించాలని రిజర్వ్‌ బ్యాంక్‌ ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఆర్బీఐ తీసుకున్న నిర్ణయంతో ఎక్కువగా తోపుడు బండి వాళు​, చిరు వ్యాపారులు, దినసరి కూలీలే నష్టపోయే అవకాశం ఎక్కువగా కనిపిస్తుందని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు.

నిత్యం నోట్ల మార్పిడి జరిగి.. చెమటతో తడిసేవి వారి నోట్లే కాబట్టి.. అవే రంగు మారుతాయి, తొందరలో చిరుగుతుంటాయి.

మరి ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.