రూ.2 వేల రూపాయల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ సంచలన ప్రకటన చేసింది.
దేశ వ్యాప్తంగా ఉన్న బ్యాంకులు అన్నీ రూ.2 వేల నోట్ల జారీని ఆపేయాలని శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.
రూ.2 వేల నోట్లను ఎందుకు రద్దు చేయాల్సి వచ్చింది.. దీనికి చాలా కారణాలు ఉన్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
రూ.2 వేల నోట్ల సర్క్యూలేషన్ నుంచి తొలగిస్తున్నట్లు వెల్లడించింది.
ఈ నెల 23 నుంచి సెప్టెంబర్ 30 లోగా బ్యాంకుల్లో మార్చుకోవాల్సిందిగా పేర్కొంది.
రూ. 2 వేల నోట్లను ఏ బ్యాంకులో అయినా మార్చుకునే సదుపాయం ఉంది.
2016 నుంచి రూ.2 వేల నోట్ల చలామణి ప్రారంభిచగా.. ఇది నల్లదనాన్ని మరింత పెంచుతుందని ఆర్ధిక వేత్తలు విమర్శించారు.
వాస్తవానికి 2018-19 ఆర్ధిక సంవత్సరంలోనే రూ.2 వేల నోట్ల ముద్రణ నిలిపివేశామని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.
ప్రస్తుతం దేశంలో రూ.3.52 లక్షల కోట్ల విలువైన రూ.2 వేల నోట్లు చెలామణీలో ఉన్నట్లు సమాచారం.
2018 మార్చి 31 నాటికి చలామణిలో ఉన్న రూ.2 వేల నోట్లు విలువ 6.73 లక్షల కోట్ల 2 వేల నోట్లు చలామణిలో ఉంటే.. ఇప్పడు 10.8 శాతం మాత్రమే మార్కెట్ లో ఉన్నాయని పేర్కొంది.
గత కొంత కాలంగా ప్రజల అవసరాలకు ఇతర డినామినేషన్లలో రూ.2 వేల నోట్లను తగనంతగా వాడటం లేదని ఆర్బీఐ గుర్తించింది.
క్లీన్ నోట్ పాలసీ లో భాగంగానే రూ.2 వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ తెలిపింది.
రూ.2 వేల నోట్ల ఉపసంహరణకు సంబంధించి బ్యాంకులకు విడిగా మార్గదర్శకాలు జారీ చేస్తున్నామని వెల్లడించింది.